Oxygen: ఎవరికి ఎంత అవసరం?
close

తాజా వార్తలు

Published : 25/05/2021 23:15 IST

Oxygen: ఎవరికి ఎంత అవసరం?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సెకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్‌ స్థాయిల సమస్య వల్ల ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా మహమ్మారి కన్నా ప్రాణవాయువు కొరతే ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. కరోనా రోగులకు కావాల్సిన ఆక్సిజన్‌ మామూలు వాతావరణంలో దొరకదు. మెడికల్‌ ఆక్సిజనే అవసరం. 93 శాతానికి పైగా శుద్ధిచేసిన ఆక్సిజన్‌ను ప్రత్యేకంగా ఉత్పత్తి చేస్తారు. ఈ నేపథ్యంలో ఒక కరోనా పేషెంట్‌కి ఎంత ఆక్సిజన్‌ అవసరం? ఆక్సిజన్‌ సపోర్టు అవసరమని ఎలా గుర్తించాలి? తదిరత విషయాలపై వైద్యులు ఏం చెబుతున్నారంటే..

కరోనా బాధితుల్లో ఎవరికి ఎప్పుడు ఆక్సిజన్‌ అవసరం?
కొవిడ్‌ సోకిన 90 శాతానికి పైగా రోగుల్లో తీవ్ర, మధ్యస్థ లక్షణాలు కలిగి ఉంటారు. వాళ్లలో హోం ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లు 7 నుంచి 10 రోజులు తగిన జాగ్రత్తలు పాటిస్తే కరోనా లక్షణాలు తగ్గుతున్నాయి. అయితే వాళ్లలో 10శాతం కన్నా తక్కువ మందికి మాత్రమే ఆక్సజన్‌ అవసరం ఉంటుంది. లక్షణాల తీవ్రత, వాళ్లకున్న వ్యాధులను బట్టి ఎంత ఆక్సిజన్‌ వాడాలి?ఏ రూపంలో వాడాలి? అనేది వైద్యులు చెబుతారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆక్సిజన్‌ ఏవిధంగా అందించాలో వైద్యులు సూచిస్తారు. 5 నుంచి 10 శాతం పేషెంట్లకు ఎన్‌ఐవి సపోర్టు కానీ, హైఫ్లో నాజల్‌ క్యానులా, మెకానికల్‌ వెంటిలేటర్‌ అవసరం అవుతాయి. మిగతా 90 శాతం మందికి ఆక్సిజన్‌ గానీ, ఆస్పత్రిలో చేరడం గాని అవసరం లేదు.

మన శరీరానికి ఆక్సిజన్‌ సపోర్టు అవసరం అని తెలుసుకోవడం ఎలా?

మనం రోజువారీ పనులు చేస్తున్నప్పడు ఆయాసం వస్తుంది. రెండు, మూడు గంటలకు ఒకసారి ఎడతెరిపి లేకుండా దగ్గు వస్తుంది. బాగా నీరసంగా అనిపిస్తుంది. ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పడు ఆక్సిజన్‌ లెవెల్స్‌ను పరీక్షించుకోవాలి. ప ల్స్ఆక్సీమీటర్‌లో 94శాతం కన్నా తక్కువగా చూపిస్తే వైద్యులను సంప్రదించాలి. ఆక్సిజన్‌ స్థాయి సరిగా ఉందో, లేదో తెలుసుకోవడానికి సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్ ఉపయోగపడుతుంది. దీనికి ఏం చేయాలంటే.. కాసేపు విశ్రాంతి తీసుకుని ఆక్సిమీటర్‌తో ఆక్సిజన్‌ స్థాయిని లెక్కించాలి. తర్వాత ఆరు నిమిషాల పాటు నడిచి మళ్లీ ఆక్సిజన్‌ స్థాయి లెక్కించుకోవాలి. మొదటి రీడింగుకి, రెండో రీడింగుకి 2 నుంచి 3 పాయింట్ల వ్యత్యాసం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 

కరోనా రోగికి ఎంత ఆక్సిజన్‌ అవసరం అన్నది ఎలా నిర్ణయిస్తారు? ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్‌ ఎలా పనిచేస్తుంది? 

కరోనా లక్షణాల తీవ్రతను బట్టి, రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలను బట్టి ఎంత ఆక్సిజన్‌ ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒక్కో పేషెంట్‌కి ఒక్కో పరిమాణంలో ఆక్సిజన్‌ అవసరం అవుతుంది. రెండు నుంచి మూడు లీటర్ల ఆక్సిజన్‌ అవసరం ఉన్నప్పుడు ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్‌ను ఉపయోగించవచ్చు. సిలిండర్స్‌తో పోలిస్తే కాన్‌సన్‌ట్రేటర్‌ కాస్త ఖరీదైనది. విద్యుత్‌ లేకపోతే  పనిచేయదు. ఇది గాలిలో ఉండే ఆక్సిజన్‌ను తీసుకుని శుద్ధిచేసి మనకు అందిస్తుంది. కాన్‌సన్‌ట్రేటర్‌ తక్కువ మోతాదులో మాత్రమే ఆక్సిజన్‌ను అందిస్తుంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని