ఆ దేశాల నుంచి వస్తే.. కరోనా టెస్ట్‌ తప్పనిసరి

తాజా వార్తలు

Published : 18/02/2021 18:01 IST

ఆ దేశాల నుంచి వస్తే.. కరోనా టెస్ట్‌ తప్పనిసరి

దిల్లీ: మహమ్మారి కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా వివిధ రూపాల్లో తలెత్తుతోంది. తొలుత బ్రిటన్‌ రకం, తాజాగా  దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ రకాలుగా వ్యాప్తిస్తోంది. ఈ విధమైన కొత్త కరోనా కేసుల వ్యాప్తి ఆయా దేశాల్లో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ దేశాల నుంచి భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి కానున్నాయి.

భారత్‌కు బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాల నుంచి ప్రత్యక్ష విమానాలు లేకపోవటంతో ప్రయాణికులు సౌదీ అరేబియా తదితర మధ్య ప్రాచ్య దేశాల ద్వారా వస్తారనే సంగతి తెలిసిందే. పై మూడు దేశాల నుంచి  ప్రత్యక్ష లేదా పరోక్ష మార్గాల ద్వారా భారత్‌కు చేరుకునే వారు.. ఇక్కడకు వచ్చిన అనంతరం కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందుకయ్యే ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని ఈ శాఖ తెలిపింది.

దేశంలో ఇప్పటివరకు 187 యూకే రకం కరోనా కేసులు నమోదు కాగా, గత నెలలో నాలుగు దక్షిణాఫ్రికా రకం కరోనా కేసులు, ఈ నెలలో ఒక బ్రెజిల్‌ రకం కరోనా కేసులు నమోదయ్యాయి. బ్రిటన్‌ రకంతో పోలిస్తే దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌  కొవిడ్‌ రకాలు త్వరగా వ్యాప్తిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. వచ్చే వారం నుంచి దేశంలోకి ప్రవేశించే అంతర్జాతీయ ప్రయాణికులను విమానయాన సంస్థలు దేశాల వారీగా విభజించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రయాణికులు భారత్‌కు వచ్చేప్పుడు  కరోనా నెగిటివ్‌ ధృవపత్రాన్ని తమ వెంట తీసుకురావాలని ఈ ప్రకటనలో వివరించారు. కాగా, కుటుంబ సభ్యుల మరణం వంటి అత్యవసర సందర్భాల్లో ఈ నిబంధన వర్తించదని అధికారులు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని