కశ్మీర్‌లో భారత్‌ చర్యలను స్వాగతిస్తున్నాం

తాజా వార్తలు

Updated : 04/03/2021 15:24 IST

కశ్మీర్‌లో భారత్‌ చర్యలను స్వాగతిస్తున్నాం

 ప్రకటించిన అమెరికా

ఇంటర్నెట్‌డెస్క్‌: కశ్మీర్‌ పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు భారత్‌ చేపట్టిన చర్యలను అమెరికా స్వాగతించింది. కశ్మీర్‌లో ఆర్థిక, రాజకీయ కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. వీటిని అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌  స్పందిస్తూ.. భారత చర్యలను స్వాగతిస్తున్నామని.. ఇవి భారత ప్రజాస్వామ్య విలువలను స్థిరపరుస్తాయని తెలిపారు.  అదే సమయంలో అక్కడ జరిగే పరిణామాలను గమనిస్తున్నామని పేర్కొన్నారు.  కశ్మీర్‌ విషయంలో అమెరికా పాలసీలో ఎటువంటి మార్పు రాలేదని పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌ క్వాడ్‌పై పలుమార్లు భారత విదేశాంగ మంత్రితో మాట్లాడారని ప్రైస్‌ తెలిపారు.

ఇక భారత్‌తో సమగ్రమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని ప్రైస్‌ వివరించారు. అదే సమయంలో పాక్‌తో కూడా  కలిసి ఉమ్మడి లక్ష్యాల కోసం పనిచేస్తామని ప్రైస్‌ వెల్లడించారు. భారత్-పాక్‌ మధ్య జరిగే చర్చలకు అమెరికా మద్దతు ఉంటుందని చెప్పారు. నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తలు చల్లారి పరిస్థితులు అదుపులోకి రావాలని తాము కోరుకుంటున్నామని నెడ్‌ప్రైస్‌ వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని