దేశంలో మరో కొత్తరకం ఫంగస్‌

తాజా వార్తలు

Published : 25/05/2021 01:22 IST

దేశంలో మరో కొత్తరకం ఫంగస్‌

ఘజియాబాద్‌: దేశంలో మరో కొత్తరకం ఫంగస్‌ కేసు వెలుగు చూసింది. ఇప్పటికే పలువురు కొవిడ్‌ రోగులు బ్లాక్‌, వైట్‌ ఫంగస్‌ బారిన పడుతుండగా.. తాజాగా ఎల్లో ఫంగస్‌ను గుర్తించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ వ్యక్తికి ఎల్లో ఫంగస్‌ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. బ్లాక్‌, వైట్ ఫంగస్‌ కంటే ఎల్లో ఫంగస్‌ మరింత ప్రమాదకరమైనదిగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కొత్త వ్యాధి బారిన పడిన వ్యక్తి ఈఎన్‌టీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

ఎల్లో ఫంగస్ లక్షణాలివే..: ఈ వ్యాధి బారినపడిన వ్యక్తుల్లో.. బద్ధకం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి తీవ్రమైన సందర్భాల్లో గాయాలు ఏర్పడితే అవి తీవ్రమవుతాయి. వాటి నుంచి చీము కారుతుంది. దీంతో నివారణ కష్టంగా ఉంటుంది. కణజాలం దెబ్బతినడంతో కళ్లకు తీవ్ర హాని కలుగుతుంది. లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స పొందకపోతే వ్యాధి ప్రాణాంతకంగా పరిణమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఆంఫోటెరిసిన్-బి ఔషధమే ఇప్పుడు ఈ వ్యాధికి అందుబాటులో ఉన్న చికిత్స..

ఆ వ్యాధి సోకడానికి గల కారణాలు..: అపరిశుభ్రతే ఈ వ్యాధి సోకేందుకు ప్రధాన కారణం. ఇంటి పరిసర ప్రాంతాలను సాధ్యమైనంత శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. పాచిన ఆహారపదార్థాలు, మల విసర్జితాలను తొలగించడం ద్వారా బ్యాక్టీరియా, ఫంగస్‌ పెరుగుదలను నివారించవచ్చు. ఫంగస్‌ పెరుగుదలలో ఇంటిలోని తేమ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని