ఇండోనేసియాలో సెరోజా ప్రతాపం

ప్రధానాంశాలు

Published : 06/04/2021 05:10 IST

ఇండోనేసియాలో సెరోజా ప్రతాపం

సుమారు 100 మంది మృతి

లెంబాట: తూర్పు తైమూర్‌, ఇండోనేసియా దీవుల్లో ‘సెరోజా’ తుపాను కారణంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వరద ఉద్ధృతికి వంతెనలు, రోడ్లు తెగిపోయాయి. దీంతో సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోగా, చాలామంది గల్లంతయ్యారు. ఇండోనేషియాలో కొండ చరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. వాటిలో నివసిస్తున్న 73 మంది మరణించారు. పలు దీవుల్లో రహదారులు, వంతెనలు తెగిపోవడానికి తోడు... విద్యుత్తు సరఫరా, భారీ పరికరాలు లేకపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. తూర్పు తైమూర్‌లో విపత్తు కారణంగా 27 మంది దుర్మరణం పాలయ్యారు.తూర్పు నుసా తెంగ్గారా ప్రావిన్స్‌లోని అడొనరా ద్వీపంలో ఆదివారం అర్ధరాత్రి లామెనెలా గ్రామంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇప్పటివరకూ 38 మంది మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు.తుపాను ధాటికి పశ్చిమ నుసా తెంగ్గారాలో ఇద్దరు, మరికొన్ని చోట్ల మరో 33 మంది మరణించినట్టు అక్కడి అధికారులు తెలిపారు.
లావాలో చిక్కుకొని మరో 42 మంది సజీవ సమాధి
తూర్పు నుసా తెంగ్గారాలోని ఇలి లెవొటోలోక్‌ ద్వీపంలో అగ్నిపర్వతం నుంచి సమీప గ్రామాలకు టన్నులకొద్దీ లావా ప్రవహిస్తోంది. వర్షాల కారణంగా ఇది ఘనీభవిస్తుండగా దీని కింద చిక్కుకొని 42 మంది సజీవ సమాధి అయ్యారు! వరద ఉద్ధృతికి ఈ ప్రాంతంలో ఐదు వంతెనలు, నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. వేల మంది స్థానికులు ప్రభుత్వ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన