close

ప్రధానాంశాలు

Published : 08/04/2021 04:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా తెచ్చిన ‘కాష్ఠ’మిది

మహారాష్ట్రలో ఒకే చితిపై ఎనిమిది మృతదేహాల దహనం

ముంబయి: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఈ వ్యాధితో మృతి చెందిన వారికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు సైతం కొన్నిచోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బీడ్‌ జిల్లా అంబజోగై పట్టణంలో ఒకే చితిపై 8 మృతదేహాలను అధికారులు దహనం చేశారు. ‘‘అంబజోగై పట్టణంలోని శ్మశానవాటికలో కరోనా రోగుల మృతదేహాలను దహనం చేయబోతే స్థానికులు వ్యతిరేకించారు. దీంతో పట్టణానికి రెండు కిలోమీటర్లు దూరంలోని మాండవా రోడ్డులో మరో స్థలంలో అంత్యక్రియలు నిర్వహించాం’’ అని మున్సిపల్‌ మండలి అధికారి అశోక్‌ సాబలే తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన తాత్కాలిక శ్మశాన వాటిక కొద్దిపాటి స్థలంలో ఉన్నందునే.. ఒకే చితిపై ఎనిమిది మృతదేహాలను పేర్చి దహనం చేయాల్సి వచ్చిందన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన