స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారం

ప్రధానాంశాలు

Published : 24/07/2021 05:22 IST

స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారం

కన్నౌజ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్‌ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. తన స్నేహితులతో కలిసి కట్టుకున్న భర్తే.. భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అదనపు కట్నం కావాలని చిత్రహింసలు పెట్టాడు. అంతేగాక ఆమెకు తలాక్‌ చెప్పాడు. గుర్షాయ్‌ ఘంజ్‌కు చెందిన ఓ యువతికి.. అదే ప్రాంతానికి చెందిన నజీమ్‌తో వివాహమైంది. పెళ్లైన కొన్నిరోజుల తర్వాత నజీమ్‌.. అదనపు కట్నం కోసం భార్యను వేధించసాగాడు. అంతేకాక తన స్నేహితులు.. జుల్‌ఫికర్‌, జబ్బార్‌, సాజిమ్‌, అమీర్‌లతో కలిసి 15 రోజుల పాటు భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎలాగోలా భర్త చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు.. జరిగిన విషయాన్ని తన కుటుంబసభ్యులకు వివరించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.


బ్రెయిన్‌ సర్జరీ చేస్తుంటే.. హనుమాన్‌ చాలీసా పారాయణం

దిల్లీ: శస్త్రచికిత్స ద్వారా మెదడులో కణతిని తొలగిస్తుండగా.. తనకేమీ జరగనట్లు హనుమాన్‌ చాలీసా పారాయణ చేసుకున్నారు ఓ మహిళ. కాగా ఆమె మధ్యలో తప్పు పలికితే ఆపరేషన్‌ చేస్తున్న వైద్యుడొకరు సహకరించారు. ఇదంతా దిల్లీ ఎయిమ్స్‌ ఆసుపత్రిలో జరిగింది. ‘క్రేనియోటమీ’ శస్త్రచికిత్స విధానం ద్వారా ఆమెకు కేవలం కణతి ఉన్న ప్రాంతంలోనే మత్తు ఇచ్చి ఆపరేషన్‌ చేశామని వైద్యులు తెలిపారు. ఆమె మెదడుకు ఎడమ వైపున కణతిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించారు. అనంతరం ఆమెకు ఏమీ కానట్లు తల.. అటూ ఇటూ ఊపుతూ ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి బయటకొచ్చారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన దృశ్యాలను అక్కడున్న వైద్య సిబ్బంది ఒకరు ఫోన్‌ రికార్డు చేసి.. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన