కొవిడ్‌ పరిస్థితులున్నా.. కెరియర్‌పై భయమేం లేదు

ప్రధానాంశాలు

Published : 15/10/2021 05:35 IST

కొవిడ్‌ పరిస్థితులున్నా.. కెరియర్‌పై భయమేం లేదు

 వర్సిటీ విద్యార్థుల్లో విశ్వాసం

దిల్లీ: కొవిడ్‌-19 పరిణామాలు కలవరపెడుతున్నప్పటికీ.. భవిష్యత్తులో తమ కెరియర్‌కు ఢోకా ఉండబోదని ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీల్లోని మెజారిటీ విద్యార్థులు నమ్మకంగా ఉన్నారు. ఈ మేరకు ‘గ్లోబల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రొఫెషనల్‌ సీఎఫ్‌ఏ ఇన్‌స్టిట్యూట్‌’ పలు దేశాల యూనివర్సిటీల్లోని 15 వేల మంది 18-25 ఏళ్లలోపు విద్యార్థులను సర్వే చేసింది. ఇందులో ఆసియా పసిఫిక్‌ ప్రాంతం నుంచి భారత్‌, ఆస్ట్రేలియా, హాంకాంగ్‌, జపాన్‌, సింగపూర్‌ ఉన్నాయి. భారత్‌లో వెయ్యి మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. తమకున్న కెరియర్‌ అవకాశాలు, ఆశలు, అంచనాలు, అవగాహన వంటివన్నీ కొవిడ్‌-19 పరిణామాలు చూశాక పూర్తిగా మారిపోయాయని 55% మంది అన్నారు. ఇకపై కెరియర్‌గా ఎంచుకోవాలనుకొనే వాటిలో ఐటీ, టెలికాం, బోధన, ప్రభుత్వ సేవలు, మీడియా, మార్కెటింగ్‌, ఫైనాన్స్‌ రంగాలు ప్రాధాన్య క్రమంలోకి వచ్చాయని పేర్కొన్నారు. అదేసమయంలో ఆయా రంగాల్లో ఉద్యోగావకాశాలు సన్నగిల్లడం, తక్కువ వేతనాలు వంటివి ఒకింత నిరుత్సాహపరుస్తున్నట్టు చెప్పారు. ఒక వేళ ఉద్యోగావకాశాల్లో అనిశ్చితి కొనసాగితే మాత్రం.. చదువులను మరింతకాలం కొనసాగిస్తామనే ధోరణి 50% మందిలో వ్యక్తమైంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన