డోపింగ్‌ అనుమానంతో కొందరు రష్యన్‌ క్రీడాకారులకు దక్కని చోటు

ప్రధానాంశాలు

Published : 24/07/2021 02:07 IST

డోపింగ్‌ అనుమానంతో కొందరు రష్యన్‌ క్రీడాకారులకు దక్కని చోటు

టోక్యో: డోపింగ్‌ అనుమానంతో కొందరు రష్యన్‌ క్రీడాకారులకు ఒలింపిక్స్‌ జట్టులో చోటు కల్పించలేదు. 335 మంది రష్యా క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్‌లో బరిలో ఉన్నారు. 2015లో మూసేసిన మాస్కో పరీక్ష ప్రయోగశాల నుంచి సేకరించిన ఆధారాల ప్రకారం కొంతమంది క్రీడాకారుల్ని రష్యా జట్టుకు ఎంపిక చేయకుండా అడ్డుకున్నట్లు ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) శుక్రవారం పేర్కొంది. ఈ ప్రయోగశాలలో పొందుపరిచిన సమాచారం, నమూనాల్ని 2019లో వాడాకు అందజేశారు. ‘‘ఇదేమీ సంక్లిష్టమైన వ్యవహారం కాదు. పెద్ద సంఖ్యలో కాకపోయినా కొందరిని ఒలింపిక్స్‌లో అనుమానితులుగా గుర్తించేవాళ్లం. కాని వాళ్లలో ఎవరూ టోక్యోకు రాలేదు. పోటీల్లో పాల్గొనడం లేదు’’ అని వాడా డైరెక్టర్‌ జనరల్‌ ఒలివీర్‌ నిగ్లి తెలిపాడు. 2014లో సోచి వింటర్‌ ఒలింపిక్స్‌లో రష్యా డోపింగ్‌ కుంభకోణం బయటపడటంతో 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా చాలామంది క్రీడాకారులపై నిషేధం పడింది. టోక్యో ఒలింపిక్స్‌, 2022 బీజింగ్‌ వింటర్‌ క్రీడల్లో రష్యా జాతీయ గుర్తింపుపై నిషేధం కొనసాగుతుంది. 335 మంది క్రీడాకారుల బృందం రష్యన్‌ ఒలింపిక్‌ కమిటీ (ఆర్‌ఓసీ) ఆధ్వర్యంలో టోక్యోలో పాల్గొంటున్నారు. వారి దుస్తులపై రష్యా పదాన్ని నిషేధించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన