అదరగొట్టిన అతాను

ప్రధానాంశాలు

Published : 30/07/2021 02:41 IST

అదరగొట్టిన అతాను

మూడో సీడ్‌కు షాక్‌
ఆర్చరీ ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశం

ర్చరీలో అదిరే విజయం.. అద్భుత ప్రదర్శన చేసిన అతానుదాస్‌.. రెండుసార్లు ఒలింపిక్‌ ఛాంపియన్‌ ఒజిన్‌ హెక్‌ (కొరియా)కు షాకిచ్చాడు. హోరాహోరీగా సాగిన పురుషుల రికర్వ్‌ సింగిల్స్‌ రెండో రౌండ్లో 6-5తో మూడో సీడ్‌ ఒజిన్‌పై విజయం సాధించాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో తొలి గేమ్‌ను ఒజిన్‌ 26-25తో గెలుచుకోగా.. ఆ తర్వాత రెండు గేమ్‌లు 27-27, 27-27తో సమమయ్యాయి. అయితే నాలుగో గేమ్‌లో గొప్పగా బాణాలు వేసిన అతాను.. 27-22తో గెలిచాడు. అయిదో గేమ్‌లో ఇద్దరూ తగ్గకపోవడంతో 28-28తో స్కోరు సమమైంది. ఫలితాన్ని తేల్చడానికి షూటాఫ్‌ నిర్వహించగా.. అతాను పైచేయి సాధించి ముందంజ వేశాడు. తొలి రౌండ్లో అతాను 6-4తో చెంగ్‌ (చైనీస్‌ తైపీ)ని ఓడించాడు.

క్వార్టర్స్‌లో హాకీ జట్టు: హాకీలో పురుషుల జట్టు జోరు కొనసాగిస్తోంది. గత మ్యాచ్‌లో స్పెయిన్‌ను 3-0తో ఓడించిన మన్‌ప్రీత్‌ సేన.. పూల్‌-ఎ నాలుగో మ్యాచ్‌లో 3-1 గోల్స్‌తో ఒలింపిక్‌ ఛాంపియన్‌ అర్జెంటీనాకు షాకిచ్చి మరో మ్యాచ్‌ మిగిలుండగానే క్వార్టర్‌ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకుంది. 43వ నిమిషంలో వరుణ్‌ కుమార్‌ కొట్టిన గోల్‌తో భారత్‌ ఖాతా తెరిచింది. అయితే అర్జెంటీనా ఆటగాడు కాసెల్లా (48వ నిమిషం) గోల్‌ కొట్టి స్కోరు సమం చేశాడు.  వివేక్‌ ప్రసాద్‌ (58వ నిమిషం), హర్మన్‌ప్రీత్‌ (59వ నిమిషం) స్వల్ప వ్యవధిలో రెండు గోల్స్‌తో భారత్‌ను విజయపథంలో నడిపించారు.

మను మెరుగ్గా..: 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌, మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో విఫలమైన మను బాకర్‌.. 25 మీటర్ల పిస్టల్‌ క్వాలిఫికేషన్‌లో అయిదో స్థానం సాధించింది. ఆమె 292 పాయింట్లతో టాప్‌-5లో స్థానం దక్కించుకుంది. మరో భారత షూటర్‌ రహి సర్నోబాత్‌ (287) 25వ స్థానంలో నిలిచింది. శుక్రవారం జరిగే ర్యాపిడ్‌ రౌండ్‌ తర్వాత టాప్‌-8లో నిలిచిన షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. స్విమ్మింగ్‌లో భారత కథ ముగిసింది. సాజన్‌ ప్రకాశ్‌ కూడా సెమీఫైనల్‌ చేరడంలో విఫలయ్యాడు. పురుషుల 100 మీటర్ల బటర్‌ఫ్లై హీట్స్‌లో 53.45 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన