అనర్హత..ఆపై ఊరట

ప్రధానాంశాలు

Published : 31/07/2021 03:04 IST

అనర్హత..ఆపై ఊరట

గట్టెక్కిన అమెరికా జట్టు

4×400 మిక్స్‌డ్‌ రిలేలో ‘బ్యాటన్‌’ వివాదం

టోక్యో: ఒలింపిక్స్‌ రిలే పరుగుల్లో బ్యాటన్‌ అందుకోవడంలో అమెరికా అథ్లెట్లు తడబడ్డ సందర్భాలు ఎన్నెన్నో. టోక్యోలోనూ అదే దృశ్యం పునరావృతం అయింది. ఇన్నేళ్లూ పురుషులు, మహిళల ఈవెంట్లలో వేర్వేరుగా బ్యాటన్‌ వైఫల్యం చూశాం. ఇప్పుడు మిక్స్‌డ్‌ ఈవెంట్లో తొలిసారిగా ఆ పరిణామం చోటు చేసుకుంది. 4×400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలే ఈవెంట్లోనూ అమెరికా జట్టు బ్యాటన్‌ అందుకోవడంలో తడబాటుతో అనర్హతకు గురయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంది. ప్రిలిమినరీ హీట్‌లో అమెరికా బృందంలోని లైనా ఇర్బీ నిర్దేశిత ప్రదేశానికంటే కాస్త ముందే ఎలీజా గాడ్విన్‌ నుంచి బ్యాటన్‌ అందుకున్నట్లుగా పేర్కొన్న అధికారులు ఆ జట్టుపై అనర్హత వేటు వేశారు. అయితే దీనిపై అమెరికా అథ్లెట్లు ఆందోళన చేపట్టడం, అప్పీల్‌కు వెళ్లడంతో తర్వాత నిర్ణయాన్ని మార్చారు. అమెరికా జట్టు ఫైనల్లో పోటీపడేందుకు అవకాశం కల్పించారు. దీంతో ఆ దేశ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు కలిసి బరిలోకి దిగే 4×400 మిక్స్‌డ్‌ రిలే ఈవెంట్‌ ఫైనల్‌ శనివారం జరగనుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన