ఫైనల్లో హుసాముద్దీన్‌

ప్రధానాంశాలు

Published : 21/09/2021 03:34 IST

ఫైనల్లో హుసాముద్దీన్‌

బళ్లారి: జాతీయ పురుషుల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాడు మహమ్మద్‌ హుసాముద్దీన్‌ ఫైనల్‌ చేరాడు. సర్వీసెస్‌ స్పోర్ట్స్‌ కంట్రోల్‌ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ) తరపున పోటీ పడుతున్న హుసాముద్దీన్‌ 57 కేజీల సెమీస్‌లో 4-1 తేడాతో ప్రపంచ యూత్‌ ఛాంపియన్‌ సచిన్‌ (హరియాణా)పై గెలిచాడు. ఫైనల్లో రోహిత్‌ (దిల్లీ)తో అతను తలపడతాడు. ఈ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో విజేతలుగా నిలిచే బాక్సర్లు.. వచ్చే నెల 24న సెర్బియాలో ఆరంభమయ్యే ప్రపంచ బాక్సింగ్‌ పోటీల్లో దేశం తరపున పాల్గొనేందుకు అర్హత సాధిస్తారు. సంజీత్‌  (92 కేజీలు), అస్సాం ఆటగాడు శివ తాప (63.5 కేజీలు) కూడా ఫైనల్‌ చేరారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన