భారత్‌దే శాఫ్‌ ఫుట్‌బాల్‌ టైటిల్‌

ప్రధానాంశాలు

Published : 17/10/2021 03:55 IST

భారత్‌దే శాఫ్‌ ఫుట్‌బాల్‌ టైటిల్‌

మాలె: దక్షిణ ఆసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో 3-0తో నేపాల్‌ను చిత్తు చేసింది.కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి 49వ నిమిషంలో బంతిని గోల్‌పోస్టులోకి పంపి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నిమిషంలో సురేశ్‌ సింగ్‌ (50వ నిమిషం) గోల్‌ చేయడంతో ఆధిక్యం రెట్టింపు అయింది. మ్యాచ్‌ ముగుస్తుందనగా సహల్‌ అబ్దుల్‌ (91వ నిమిషం) భారత్‌ తరఫున మూడో గోల్‌ కొట్టాడు. శాఫ్‌ టైటిల్‌ గెలవడం భారత్‌కు ఇది ఎనిమిదోసారి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన