సామాజిక సంస్కరణలకు బీజం వేసిన కరుణానిధి

ప్రధానాంశాలు

Published : 03/08/2021 05:34 IST

సామాజిక సంస్కరణలకు బీజం వేసిన కరుణానిధి

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

ఈనాడు డిజిటల్‌, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తన విప్లవాత్మక ఆలోచనలతో సామాజిక సంస్కరణలకు బీజం వేశారని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొనియాడారు. 1921లో మద్రాస్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ ప్రారంభమై... తర్వాత తమిళనాడు శాసనసభగా రూపాంతరం చెందింది. ఈ నేపథ్యంలో శాసనసభ శతాబ్ది వేడుకలు, కరుణానిధి చిత్రపటం ఆవిష్కరణ కార్యక్రమాలు సోమవారం చెన్నైలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్రపతి... సెయింట్ జార్జికోటలోని అసెంబ్లీ హాలులో కరుణానిధి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోవింద్‌ మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ముఖ్యమైన నాయకుడు కరుణానిధి అని, ఆయన చిత్రపటాన్ని ఆవిష్కరించినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాట్లాడుతూ... అసెంబ్లీలో కరుణానిధి చిత్రపటాన్ని చూస్తుంటే ఇంకా ముందుండి దారి చూపుతున్న సీఎంగా అనిపిస్తోందని పేర్కొన్నారు. చరిత్రను దాచిపెట్టి కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్ష అన్నాడీఎంకే నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన