అమృత్‌ మహోత్సవ వేళ.. అద్భుత విజయాలు

ప్రధానాంశాలు

Published : 03/08/2021 05:57 IST

అమృత్‌ మహోత్సవ వేళ.. అద్భుత విజయాలు

దిల్లీ: 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలకు గుర్తుగా ‘అమృత్‌ మహోత్సవ్‌’ నిర్వహించుకుంటున్న వేళ.. భారతావని సాధించిన అద్భుత విజయాలు ప్రతి భారతీయుడి మదిని పులకింపచేశాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సింధు విజయం, అత్యధిక జీఎస్టీ వసూళ్లు, ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్ల ప్రదర్శన తదితర ఘనతలను భారత్‌ సాధించడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ‘‘సింధు పతకం సాధించడమే కాదు, ఒలింపిక్స్‌లో పురుషులు, మహిళల హాకీ జట్లు చరిత్రాత్మక ప్రదర్శనను మనం చూశాం’’ అని మోదీ ట్వీట్‌ చేశారు. జులై నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటాయి. భారతీయులు కష్టపడి పనిచేస్తే.. భారత్‌ ఉన్నత శిఖరాలకు చేరడం ఖాయమని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన