ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రహదారి

ప్రధానాంశాలు

Published : 05/08/2021 05:13 IST

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రహదారి

 తూర్పు లద్దాఖ్‌లో నిర్మించిన సరిహద్దు రహదారి సంస్థ

దిల్లీ: సరిహద్దు రహదారి సంస్థ (బీఆర్‌వో) ప్రపంచంలోనే అత్యంత ఎత్తున రహదారిని నిర్మించింది! తూర్పు లద్దాఖ్‌లోని ఉమ్లింగ్లా పాస్‌ వద్ద 19,300 అడుగుల ఎత్తులో 52 కిలోమీటర్ల మేర బ్లాక్‌-టాప్‌ నిర్మాణం చేపట్టినట్టు ఆ సంస్థ బుధవారం వెల్లడించింది. ఇప్పటివరకూ బొలీవియాలోని యూటురుంచు అగ్నిపర్వతంపై 18,953 అడుగుల ఎత్తులో ఉన్న రహదారి రికార్డును ఇది అధిగమించింది. ఉమ్లింగ్లాలో నిర్మించిన రహదారి చుమర్‌ సెక్టారులోని ముఖ్యమైన పట్టణాలను కలుపుతుంది. లేహ్‌ నుంచి చిసుమ్లే, డెమ్‌చోక్‌లను నేరుగా చేరుకునేందుకు ఈ ప్రత్యామ్నాయ మార్గం ఉపయోగపడుతుందని, ఇది స్థానికులకు ఒక వరమని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. చలికాలంలో 19,300 అడుగుల ఎత్తు వద్ద ఉష్ణోగ్రతలు -40 డిగ్రీల మేర ఉంటాయని, ఆక్సిజన్‌ 50% తక్కువగా ఉంటుందని తెలిపింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన