విపక్షాలవి జాతి వ్యతిరేక రాజకీయాలు

ప్రధానాంశాలు

Published : 06/08/2021 05:31 IST

విపక్షాలవి జాతి వ్యతిరేక రాజకీయాలు

ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజం

లఖ్‌నవూ: యావత్తు దేశం ఒక్కో లక్ష్యాన్ని ఛేదించుకుంటూ విజయం దిశగా పురోగమించాలన్న కృత నిశ్చయంతో ఉంటే ప్రతిపక్షాలు రాజకీయ స్వార్థంతో సెల్ఫ్‌గోల్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. పెగాసస్‌ స్పైవేర్‌ వివాదం అంశంలో ఆందోళనను కొనసాగిస్తూ పార్లమెంటు కార్యకలాపాలను పదే పదే అడ్డుకుంటున్న విపక్షాల తీరును దుయ్యబట్టారు. గురువారం ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ‘ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన’ లబ్ధిదారులతో వర్చువల్‌ విధానంలో మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణం 370ను రద్దు చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ‘దేశ చరిత్రలో ఆగస్టు 5వ తేదీ గుర్తుండిపోతుంది. రెండేళ్ల క్రితం ఇదే రోజున ఆర్టికల్‌ 370 రద్దయింది. గత ఏడాది ఇదే రోజున అయోధ్యలో రామమందిర నిర్మాణానికి తొలి అడుగు పడింది. నేడు ఒలింపిక్స్‌ క్రీడల్లో మన దేశ జట్టు చిరస్మరణీయమైన విజయం సాధించింది’ అని మోదీ తెలిపారు. పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయాలు కలగడంపై మాట్లాడుతూ ‘అభివృద్ధిని అడ్డుకోవటమే విపక్షాల లక్ష్యం. వారి చర్య దేశ వ్యతిరేకం’ అని పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన