ప్రతి రూపాయీ ప్రాణాలు కాపాడేందుకే

ప్రధానాంశాలు

Updated : 21/09/2021 14:14 IST

ప్రతి రూపాయీ ప్రాణాలు కాపాడేందుకే

ఆదాయపు పన్ను సోదాల అనంతరం సోనూసూద్‌ ప్రకటన

ముంబయి: తన సేవా సంస్థలో జమ అయిన ప్రతి రూపాయీ ఇతరుల ప్రాణాలను కాపాడడానికి ఎదురు చూస్తోందని ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్‌ వ్యాఖ్యానించారు. ఆయనతో పాటు సహచరులు రూ.20 కోట్ల మేర పన్ను ఎగవేశారంటూ ఆదాయపు పన్ను విభాగం ఆరోపించిన నేపథ్యంలో సోమవారం తొలిసారిగా దీనిపై ఇన్‌స్టాగ్రాంలో ప్రకటన విడుదల చేశారు. ‘‘నేను కొందరు అతిథులతో బిజీగా ఉన్నా. అందుకే గత నాలుగు రోజులుగా ప్రజల సేవకు అందుబాటులో లేకుండా పోయాను’’ అని పేర్కొన్నారు. ‘‘అత్యంత వినయంతో మళ్లీ తిరిగి వచ్చా. మీ సేవ కోసం...ప్రాణాల కోసం...నా ప్రయాణం కొనసాగుతుంది. జైహింద్‌’’ అని పేర్కొన్నారు. తన శక్తిని, హృదయాన్ని దేశ ప్రజల సేవకే వినియోగిస్తానని తెలిపారు. ‘‘మన గురించి మనం ఎల్లప్పుడూ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాలమే చెబుతుంది. నా ఫౌండేషన్‌లోని ప్రతి రూపాయి విలువైన ప్రాణాలు కాపాడడానికి, అవసరమున్నవారిని ఆదుకోవడానికి సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాయి. నాకు ఇచ్చే ఫీజును మానవత కార్యక్రమాలకు విరాళాలుగా ఇవ్వాలని ఎన్నోసార్లు చెప్పాను. మంచి పనులకు ఎప్పుడూ శుభకర ముగింపే ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన