రష్యా యూనివర్సిటీలో కాల్పులు

ప్రధానాంశాలు

Published : 21/09/2021 04:52 IST

రష్యా యూనివర్సిటీలో కాల్పులు

ఆరుగురి మృతి.. 28 మందికి గాయాలు
పోలీసుల అదుపులో సాయుధుడు

మాస్కో: రష్యాలోని పర్మ్‌ నగరంలోని యూనివర్సిటీలో సోమవారం కాల్పుల మోత మోగింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని సాయుధుడు క్యాంపస్‌లోకి ప్రవేశించి విద్యార్థులు, సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో 6 మంది విద్యార్థులు మృతి చెందారు. 28 మంది గాయపడ్డారు. కొందరు విద్యార్థులు ప్రాణభయంతో యూనివర్సిటీ ఆడిటోరియంలోకి వెళ్లి దాక్కున్నారు. మరికొంత మంది భవనం తొలి అంతస్తు కిటికీల్లోంచి దూకారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. సాయుధుడిని అదుపులోకి తీసుకున్నట్లు రష్యా అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. యూనివర్సిటీ విద్యార్థే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అధికారులు తెలిపారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో సాయుధుడు గాయపడ్డాడని, అతని పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. పర్మ్‌ నగరం మాస్కోకు తూర్పున 1100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి యూనివర్సిటీలో దాదాపు 12 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. మేలో కూడా రష్యాలోని కజాన్‌ నగరంలో ఇటువంటి సంఘటనే ఓ విద్యాసంస్థలో చోటు చేసుకుంది. ఆ కాల్పుల ఘటనలో ఏడుగురు విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందారు.

భారతీయ విద్యార్థులు సురక్షితం

పర్మ్‌ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన