టమాటా ధరల మోత

ప్రధానాంశాలు

Published : 19/10/2021 05:14 IST

టమాటా ధరల మోత

కోల్‌కతాలో కిలో రూ.93

దిల్లీ: భారీ వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో పంట దెబ్బతినడంతో దేశంలో టమాటా ధరకు రెక్కలొచ్చాయి. మెట్రో నగరాలకు సరఫరా తగ్గిపోవడంతో అక్కడ ధరలు మండిపోతున్నాయి. కోల్‌కతాలో కిలో రూ.93, చెన్నైలో రూ.60, దిల్లీలో రూ.59, ముంబయిలో రూ.53 ధర పలుకుతోంది. మరో 50 నగరాల్లో కిలో టమాటా రూ.50కి పైనే ఉంది.  మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో వర్షాలకు పంట బాగా దెబ్బతింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన