జలాంతర్గామి క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా!

ప్రధానాంశాలు

Published : 20/10/2021 05:25 IST

జలాంతర్గామి క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా!

సియోల్‌: వరుస ఆయుధ పాటవ ప్రదర్శనలతో ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తున్న ఉత్తర కొరియా.. మంగళవారం ఒక బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించింది. ఇది జలాంతర్గాముల నుంచి ప్రయోగించేందుకు ఉద్దేశించిన అస్త్రమని దక్షిణ కొరియా సైన్యం విశ్లేషిస్తోంది. అమెరికాలో బైడెన్‌ సర్కారు కొలువుదీరాక ఉత్తర కొరియా చేపట్టిన అత్యంత ముఖ్యమైన క్షిపణి పరీక్ష ఇదేనని విశ్లేషకులు తెలిపారు. ఉత్తర కొరియా తూర్పు తీరంలోని సిన్‌పో రేవుకు సమీపంలో సాగర జలాల నుంచి ఈ స్వల్ప శ్రేణి క్షిపణిని ప్రయోగించడాన్ని తాము పసిగట్టినట్లు దక్షిణ కొరియా సైనిక ఉన్నతాధికారి తెలిపారు. తాజా ప్రయోగంలో ఉత్తర కొరియా రెండు అస్త్రాలను పరీక్షించినట్లు తమ ప్రాథమిక విశ్లేషణలో స్పష్టమైందని జపాన్‌ సైన్యం తెలిపింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన