నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలతో ఎస్సీ స్థానాల నుంచి గెలిచారు

ప్రధానాంశాలు

Updated : 21/10/2021 11:17 IST

నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలతో ఎస్సీ స్థానాల నుంచి గెలిచారు

కేంద్ర సహాయమంత్రి, మరో నలుగురు

ఎంపీలపై జితన్‌ రామ్‌ మాంఝీ ఆరోపణ

దిల్లీ: నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించి, ఓ కేంద్రమంత్రి సహా మొత్తం ఐదుగురు... ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల నుంచి లోక్‌సభ ఎంపీలుగా గెలుపొందారని బిహార్‌ మాచ్కీజీజి ముఖ్యమంత్రి, హిందుస్థాన్‌ ఆవామ్‌ మోర్చా (సెక్యులర్‌) అధ్యక్షుడు చ్కీజిజితన్‌ రామ్‌ మాంఝీ ఆరోపించారు. బుధవారం ఇక్కడ జరిగిన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మాంఝీ మాట్లాడారు. ‘‘కేంద్ర సహాయమంత్రి సత్యపాల్‌ సింగ్‌ బఘేల్‌ (భాజపా), జైసిద్ధేశ్వర్‌ శివాచార్య మహాస్వామీచ్కీజీజి (భాజపా), మహమ్మద్‌ సిద్దిఖీ (కాంగ్రెస్‌), అపరూప పొద్దర్‌ (తృణమూల్‌), నవనీత్‌ రవి రాణా (స్వతంత్ర)లు తప్పుడు కులధ్రువీకరణ పత్రాలతో ఎస్సీ నియోజకవర్గాల నుంచి ఎంపీలుగా గెలుపొందారు. ఈ అంశంపై విచారణ జరగాలి. కశ్మీర్‌లో శాంతి స్థాపనకు కేంద్రం కృషి చేస్తుండవచ్చు. క్షేత్రస్థాయిలో మాత్రం అదేమీ కనిపించడం లేదు.

అక్కడ పనులు చేసుకుంటున్న బిహారీ, ఇతర ప్రాంతాల వలస కూలీలను ఉగ్రవాదులు హతమార్చుతున్నారు. ‘రాముడు’ ఒక కల్పిత పాత్ర మాత్రమే. ఆయన కంటే మహర్షి వాల్మీకి వెయ్యి రెట్లు పెద్దవాడు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం. ఎవరి మనోభావాలనూ కించపరచాలని నేను అనుకోవడం లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. బిహార్‌లో సీఎం నీతీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో హిందుస్థాన్‌ ఆవామ్‌ మోర్చా కూడా భాగస్వామి కావడం గమనార్హం. ఇంతకుముందు కూడా మాంఝీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన