ముంబయి అపార్ట్‌మెంటులో అగ్నిప్రమాదం..

ప్రధానాంశాలు

Published : 23/10/2021 05:13 IST

ముంబయి అపార్ట్‌మెంటులో అగ్నిప్రమాదం..

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరంలోని 61 అంతస్తుల విలాసవంతమైన అపార్ట్‌మెంటులో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కరీ రోడ్డు ప్రాంతంలోని అవిజ్ఞ పార్క్‌ సొసైటీ అపార్ట్‌మెంటు 19వ అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటలు పెద్దఎత్తున ఎగసిపడుతుండగా.. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. విషయం తెలిసి తన సహచరులతో పాటు 19వ అంతస్తుకు చేరుకున్న సెక్యూరిటీ గార్డు అరుణ్‌ తివారి (30) ఓ మహిళను,  ఇద్దరు చిన్నారులను రక్షించారు. ఈ ప్రయత్నంలో బాల్కనీ దాకా వెళ్లాక.. తాను మంటల్లో చిక్కుకుపోయినట్లు అరుణ్‌ గ్రహించాడు. గత్యంతరం లేక అక్కడే ఊగిసలాడుతూ కిందికి జారిపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇతను ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందినవాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. మంటల్లో చిక్కుకొన్న 16 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. నాలుగు గంటల పోరాటం తర్వాత సాయంత్రానికి పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా భావిస్తున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన