ప్రభుత్వ బస్సులో స్టాలిన్‌ ప్రయాణం

ప్రధానాంశాలు

Updated : 24/10/2021 05:35 IST

ప్రభుత్వ బస్సులో స్టాలిన్‌ ప్రయాణం

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ శనివారం చెన్నైలో ఆకస్మికంగా ఓ ప్రభుత్వ బస్సు ఎక్కారు. ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. చెన్నై, ఎళిల్‌నగర్‌లో ఏర్పాటు చేసిన టీకా శిబిరాన్ని పరిశీలించిన అనంతరం కారులో తిరిగివెళ్తూ కన్నగినగర్‌ రోడ్డులో వెళ్తున్న బస్సును ఎక్కారు. ఉచిత ప్రయాణ పథకం అమలు గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు.    

- న్యూస్‌టుడే, చెన్నై(ఆర్కేనగర్‌)Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన