టీకా వేసుకుంటే.. ఎల్‌ఎఫ్‌టీ చాలు

ప్రధానాంశాలు

Published : 25/10/2021 04:54 IST

టీకా వేసుకుంటే.. ఎల్‌ఎఫ్‌టీ చాలు

విదేశీ ప్రయాణికులకు ఇంగ్లాండ్‌ వెసులుబాటు

లండన్‌: టీకా రెండు డోసులూ తీసుకొని ఇతర దేశాల నుంచి ఇంగ్లాండ్‌కు వెళ్లే ప్రయాణికులు ఇకపై తక్కువ ఖర్చులో పూర్తయ్యే ‘లాటెరల్‌ ఫ్లో టెస్ట్‌ (ఎల్‌ఎఫ్‌టీ)’ విధానంలో కొవిడ్‌ పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది. పర్యటక రంగానికి మరింత ఊపు తీసుకురావడమే లక్ష్యంగా ఈ మేరకు నిబంధనలను కాస్త సడలించినట్లు ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. విదేశాల నుంచి వచ్చేవారంతా కచ్చితంగా ‘పాలీమెరేజ్‌ చైన్‌ రియాక్షన్‌ (పీసీఆర్‌)’ విధానంలోనే కరోనా పరీక్ష చేయించుకోవాలని ఇప్పటివరకు నిబంధన ఉండేది. ఎల్‌ఎఫ్‌టీతో పోలిస్తే పీసీఆర్‌ కాస్త ఖరీదైన వ్యవహారం. బ్రిటన్‌లో భాగంగా ఉన్న వేల్స్‌, స్కాట్లాండ్‌, ఉత్తర ఐర్లాండ్‌ కూడా ఇకపై విదేశీ ప్రయాణికులకు ఎల్‌ఎఫ్‌టీ పరీక్ష వెసులుబాటును కల్పించే అవకాశముంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన