నిషేధిత పార్టీకి తలొగ్గిన పాక్‌

ప్రధానాంశాలు

Published : 26/10/2021 05:19 IST

నిషేధిత పార్టీకి తలొగ్గిన పాక్‌

 పోలీసుస్టేషన్ల నుంచి 350 మంది విడుదల

లాహోర్‌: పాకిస్థాన్‌లో నిషేధిత తెహ్రీక్‌-ఇ-లబ్బాయిక్‌ పాకిస్థాన్‌ (టీఎల్‌పీ) పార్టీ బెదిరింపులకు ఆ దేశ ప్రభుత్వం తలొగ్గింది. ఆ పార్టీకి చెందిన 350 మంది కార్యకర్తల్ని సోమవారం పలు పోలీసుస్టేషన్ల నుంచి భేషరతుగా విడుదల చేసింది. గతంలో ఫ్రాన్స్‌లో ప్రవక్త వ్యంగ్య చిత్రాలు ప్రచురించినందుకు ప్రతీకారంగా పాక్‌లో ఉన్న ఫ్రెంచ్‌ రాయబారిని బహిష్కరించాలని టీఎల్‌పీ కొంతకాలంగా డిమాండ్‌ చేస్తోంది. ఇదే విషయంలో గత ఏప్రిల్‌లో అరెస్టయి జైలులో ఉన్న టీఎల్‌పీ అధినేత షాద్‌ రిచ్కీజీజ్విని విడుదల చేయాలని కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగింది. ఈ నిరసనలు హింసాత్మకంగా మారుతుండంతో పాటు ఆందోళనకారుల పాదయాత్ర ఇస్లామాబాద్‌ వైపుగా వస్తుండటంతో ప్రభుత్వం దిగొచ్చింది. మధ్యేమార్గంగా పలు పోలీసుస్టేషన్లలో ఉన్న ఆ పార్టీ కార్యకర్తల్ని వదిలిపెట్టింది. అయితే టీఎల్‌పీ మాత్రం తమ డిమాండ్లను పూర్తిగా అంగీకరించేవరకు వెనక్కు తగ్గేది లేదని ప్రకటించింది. ప్రస్తుతం సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తిరిగొచ్చిన వెంటనే టీఎల్‌పీ డిమాండ్లపై చర్చిస్తామని, అప్పటివరకు శాంతంగా ఉండాలని అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్‌ రషీద్‌.. ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన