కొవాగ్జిన్‌ తీసుకున్నవారు ఒమన్‌ వెళ్లొచ్చు

ప్రధానాంశాలు

Updated : 28/10/2021 10:32 IST

కొవాగ్జిన్‌ తీసుకున్నవారు ఒమన్‌ వెళ్లొచ్చు

ఈనాడు, దిల్లీ: కొవాగ్జిన్‌కు ఒమన్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, అందువల్ల ఆ వ్యాక్సిన్‌ తీసుకున్న ప్రయాణికులు క్వారంటైన్‌ అవసరం లేకుండా ఆ దేశానికి వెళ్లొచ్చని మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. బయల్దేరడానికి కనీసం 14 రోజుల ముందు రెండు డోసుల కొవాగ్జిన్‌ టీకా తీసుకున్న వారు అక్కడికి చేరుకున్న తర్వాత క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. అక్కడికి చేరుకోవడానికి ముందు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చినట్లు నివేదిక ఉండాలని, ఇతర కొవిడ్‌ నిబంధనలన్నీ యథాతథంగా పాటించాలని స్పష్టంచేసింది.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన