పెగాసస్‌పై జోక్యం చేసుకోండి

ప్రధానాంశాలు

Updated : 30/07/2021 10:31 IST

పెగాసస్‌పై జోక్యం చేసుకోండి

సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు ప్రముఖుల లేఖ

దిల్లీ: పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ దేశంలోని దాదాపు 500 మంది ప్రముఖులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణకు లేఖ రాశారు. ఈ స్పైవేర్‌ను అందించకుండా ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ సంస్థపై ఆంక్షలు విధించాలని కోరారు. విద్యార్థినులు, లైంగిక వేధింపులకు గురయిన వారిపై కూడా ఈ స్పైవేర్‌ సాయంతో నిఘా పెట్టడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ఉన్నత పదవుల్లో ఉన్నవారికి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై నిఘా పెట్టడం వల్ల వారి జీవితాలు నాశనమయినట్టు తెలిపారు. దీనిపై సంతకాలు చేసిన వారిలో ప్రముఖ న్యాయవాది వృందా గ్రోవర్‌, మానవ హక్కుల కార్యకర్తలు అరుణా రాయ్‌, అంజలీ భరద్వాజ్‌ తదితరులు ఉన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన