సరిలేరు నీకెవ్వరు..
close

కథనాలు

Published : 11/01/2021 14:41 IST

సరిలేరు నీకెవ్వరు..

ద్రవిడ్‌ పుట్టిన రోజు సందర్భంగా..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి, జాతీయ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌(43) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా అభిమానులు, పలువురు క్రికెటర్లు అతడికి శుభాకాంక్షలు చెప్పారు. ది గ్రేట్‌ వాల్‌గా పేరుతెచ్చుకున్న కర్ణాటక బ్యాట్స్‌మన్‌ భారత క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ఈ నేపథ్యంలో బ్యాట్స్‌మన్‌గా, వికెట్‌ కీపర్‌గా, కెప్టెన్‌గా విభిన్న పాత్రలు పోషించాడు. అంత గొప్ప ఆటగాడు భారత్‌ తరఫున ప్రపంచకప్‌ గెలవకపోయినా, 2018 అండర్‌ 19 ప్రపంచకప్‌ గెలిచిన టీమ్‌ఇండియాకు హెడ్‌కోచ్‌గా వ్యవహరించాడు. అతడి పుట్టిన రోజు సందర్భంగా ఆయన సాధించిన విజయాలను గుర్తుచేసుకుందాం..


కప్పు కల నెరవేరిన వేళ..

2018 అండర్‌ 19 ప్రపంచకప్‌ ఫైనల్లో పృథ్వీషా నేతృత్వంలోని టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాపై గెలిచింది. అప్పుడు మెగా కప్పును ద్రవిడ్‌ చేతుల్లోకి తీసుకున్న వేళ.


చూడచక్కని లార్డ్స్‌ బౌండరీ..

2011 ఇంగ్లాండ్‌ పర్యటన సందర్భంగా ప్రతిష్ఠాత్మకమైన లార్డ్స్‌ మైదానంలో బ్యాటింగ్‌ చేస్తున్న వేళ. ద్రవిడ్‌ మోకాలిపై కూర్చొని చూడచక్కటి బౌండరీ బాదాడు.


టీమ్‌ఇండియా సేవలకు గుర్తుగా..

16 ఏళ్ల పాటు టీమ్‌ఇండియాకు ప్రాతినిథ్యం వహించి ఎన్నోసార్లు ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించిన వాల్‌ సేవలకు గుర్తుగా బీసీసీఐ సత్కరించిన చిత్రం. 2012లో ద్రవిడ్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.


రనౌట్‌ నుంచి తప్పించుకునేందుకు..

2011 నాట్‌వెస్ట్‌ సిరీస్‌లో భాగంగా ఐదో వన్డేలో రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న వేళ. ఆ మ్యాచ్‌లో ద్రవిడ్‌ 69 పరుగులు చేసి స్వాన్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.


సచిన్‌తో కలిసి శతకం బాది..

1999 ప్రపంచకప్‌లో కెన్యాతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా తొలుత బ్యాటింగ్‌ చేసి 329 పరుగులు చేసింది. అప్పుడు ద్రవిడ్‌(104*), సచిన్‌(140*) శతకాలు బాదారు. ఇన్నింగ్స్‌ అనంతరం వారిద్దరూ నడుచుకుంటూ వస్తున్న చిత్రం.


రజాక్‌ బ్యాటింగ్‌.. ద్రవిడ్‌ కీపింగ్‌..

టీమ్‌ఇండియా తరఫున కొద్దికాలం కీపింగ్‌ బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్‌ 2004 పాకిస్థాన్‌ పర్యటనలోనూ అలాగే కొనసాగాడు. ఓ వన్డే మ్యాచ్‌లో అబ్దుల్‌ రజాక్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా ద్రవిడ్‌ ఎర్ర కళ్లద్దాలు పెట్టుకొని కీపింగ్‌ చేస్తున్న చిత్రం. 


వర్షంలో విజయానందం..

2003 ప్రపంచకప్‌లో సూపర్‌ సిక్స్‌ సందర్భంగా న్యూజిలాండ్‌పై భారత్‌ విజయం సాధించాక. నాటి క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌తో కలిసి వర్షంలో విజయానందం. 


ధోనీతో కలిసి టాస్‌కు వెళుతూ.. 

2011 ఐపీఎల్‌ సందర్భంగా ద్రవిడ్‌ రాజస్థాన్‌ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన సందర్భంగా. ఓ మ్యాచ్‌లో చెన్నైతో ఢీకొనే ముందు ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్‌ ధోనీతో కలిసి టాస్‌ వేయడానికి నడిచి వెళ్తున్న వేళ.

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన