close

తాజా వార్తలు

విషాదాన్ని నింపిన ‘ప్రేమ పరీక్ష’

వీడియో వైరల్‌

బీజింగ్‌: ప్రేమను ఒక్కక్కరూ ఒక్కోలా వ్యక్తపరుస్తారు. అవతలి వ్యక్తుల్లో తమ పట్ల ఉండే ప్రేమను తెలుసుకోవడానికి కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రేమ ప్రయాణంలో ఇదో సరదా అనిపించినా ఒక్కోసారి ఈ ప్రేమ పరీక్షలు విషాదాన్ని నింపవచ్చు. చైనాలోని ఝీజియాంగ్ ప్రావిన్సులోని లీషుయ్‌ ప్రాంతంలో జరిగిన ఘటనే ఇందుకు తాజా నిదర్శనం. తన భార్యకు తన పట్ల ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి ఓ వ్యక్తి  పెద్ద సాహసమే చేశాడు. చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

లీషుయ్‌ ప్రాంతానికి చెందిన పాన్‌ అనే బడా వ్యాపారికి తన భార్య జువోకు తనపై ఎంత ప్రేముందో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. ఈ క్రమంలో ఈనెల 13న అర్ధరాత్రి బాగా రద్దీగా ఉండే ప్రదేశానికి ఆమెను తీసుకెళ్లాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఉన్నట్లుండి అతడు నడిరోడ్డుపై నిలబడ్డాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన జువో తన భర్తను కాపాడుకుంది. ఈ విషయంలో ఇద్దరికీ కాసేపు వాగ్వాదం జరిగింది. మళ్లీ పాన్‌ నడిరోడ్డుపై నిల్చున్నాడు. అక్కడికి జువో చేరుకునే లోపు వేగంగా వస్తున్న ఓ వాహనం అతడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో పాన్‌ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ దృశ్యమంతా అక్కడే ఉన్న ట్రాఫిక్‌ కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియోను ట్రాఫిక్‌ పోలీసు ఒకరు సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఇది వైరల్‌ అవుతోంది. ప్రేమను తెలుసుకోవడానికి ఎన్నో దారులున్నాయని ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.