close

తాజా వార్తలు

అంబానీ జీతం.. మళ్లీ అదే రూ.15కోట్లే

వరుసగా 11వ ఏడాది ఒకే స్థాయి వేతనం

ఏటా రూ. 24కోట్లు వదులుకుంటున్న వైనం

దిల్లీ: అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ వరుసగా పదకొండో ఏడాది తన వార్షిక  వేతనాన్ని రూ. 15కోట్లకు పరిమితం చేసుకున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ హోదాలో 2008-09 నుంచి ముకేశ్‌ ఇంతే జీతం తీసుకుంటున్నారు. దాదాపు ఏటా రూ. 24కోట్లను తృణప్రాయంగా వదులుకుంటున్నారు. కంపెనీలో శాశ్వత డైరెక్టర్లందరి జీతాలు పెరుగుతున్నా ముకేశ్‌ మాత్రం తన వేతనాన్ని పెంచుకునేందుకు ఇష్టపడట్లేదు. 

‘ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముకేశ్‌ అంబానీ కోరిక మేరకు ఈ ఏడాది కూడా ఆయన వేతనాన్ని రూ. 15కోట్లుగా నిర్ణయించాం. యాజమాన్య వేతన స్థాయిలు తక్కువగా ఉండాలని చెప్పడానికి ముకేశ్‌ వ్యక్తిగత ఉదాహరణగా నిలిచారు’ అని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన వార్షిక నివేదికలో పేర్కొంది. 2018-19లోనూ ముకేశ్ ఇంతే మొత్తం జీతంగా తీసుకున్నారు. 

* 2018-19లో ముకేశ్‌ రూ. 4.45కోట్లు జీతంగా అందుకున్నారు. ఇక కమిషన్ కింద రూ. 9.53కోట్లు, ఇతర భత్యాలు రూ. 31లక్షలు, పదవీ విరమణ ప్రయోజనాల కింద రూ. 71లక్షలు తీసుకున్నారు. 

* సీఈఓల వేతన పరిమాణాలపై చర్చ నేపథ్యంలో అక్టోబరు 2009న అంబానీ తన వేతనాన్ని స్వచ్ఛందంగా రూ.15 కోట్లకు పరిమితం చేసుకున్నారు. ఇతర ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల వేతనాలు పెరిగినప్పటికీ.. ఈయన మాత్రం ఆ మొత్తానికే కట్టుబడి ఉన్నారు.

* అంబానీ బంధువులైన నిఖిల్‌ ఆర్‌ మేస్వానీ, హితాల్‌ ఆర్‌ మేస్వానీ కూడా కంపెనీలో శాశ్వత డైరెక్టర్లుగా ఉన్నారు. వీరి వేతనాలు రూ. 20.57కోట్లకు పెరిగాయి. ఎగ్జిక్యూటివ్‌ పీఎంఎస్‌ ప్రసాద్‌ వేతనం రూ. 8.99కోట్ల నుంచి రూ. 10.01కోట్లకు పెరిగింది. 

* నీతా అంబానీ సహా కంపెనీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లకు రూ. 1.65కోట్ల కమిషన్‌ లభించింది. సిట్టింగ్‌ ఫీజుకు ఇది అదనం. అంతక్రితం ఏడాది ఈ కమిషన్‌ రూ. 1.5కోట్లుగా ఉంది. సిట్టింగ్‌ ఫీజు కింద నీతా అంబానీ రూ. 7లక్షలు అందుకున్నారు. గతేడాది రిలయన్స్‌ బోర్డులో చేరిన ఎస్‌బీఐ మాజీ ఛైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాఛార్య రూ. 75లక్షల కమిషన్‌ తీసుకున్నారు. 

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.