close

తాజా వార్తలు

నవరాత్రుల్లో అమ్మవారిని ఇలా పూజించండి!

మ్మవారిని ఆరాధించటానికి అత్యంత పవిత్రమైన రోజులు శరన్నవరాత్రులు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకూ పది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. భక్తులు నియమ నిష్ఠలతో, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ ప్రత్యేక రోజుల్లో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలిగించే జగన్మాతను ఏ రూపంలో కొలవాలి.  ఏరకమైన పూజలు చేయాలి? ఏ మంత్రాలు జపించాలి? తదితర విషయాలను దేవీ ఉపాసకులు మాచిరాజు కిరణ్‌ ఇలా చెప్పుకొచ్చారు.

మొదటిరోజు: స్వర్ణ కవచాలంకృత కనకదుర్గా దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. గృహంలో అమ్మవారి చిత్రపటానికి ఎర్రటి మందారపూలతో పూజ చేయాలి. ‘‘ ఓం శ్రీ కనకదుర్గా దేవతాయే నమో నమః’’ అనే మంత్రంతో అమ్మవారికి ఎర్రటి మందారపూలతో పూజ చేస్తారో వారు అంతఃశత్రు బాధల తీవ్రతను తగ్గింప చేసుకోవచ్చు. రుణబాధల తీవ్రతను తగ్గింపచేసుకోవచ్చు.

రెండో రోజు: బాలా త్రిపురసుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజు ‘‘భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితా’’ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించాలి. అమ్మవారికి  పసుపు పచ్చటి చామంతిపూలతో పూజించాలి.

మూడో రోజు: గాయత్రిదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఇంట్లో  అమ్మవారి చిత్రపటానికి  తెల్లటి పూలతో పూజచేయాలి. వీలైనన్ని సార్లు ‘‘గాయత్రి వ్యాహౄతి సంధ్యా నిజబృంద నిషేవితా’ అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయటం వల్ల గాయత్రి దేవి అనుగ్రహంతో  జీవితంలో అన్న పానాలకు ఎలాంటి లోటు ఉండదు.

నాలుగో రోజు: అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. అమ్మవారికి తెల్లటిపూలతో పూజచేయాలి. ‘‘పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరీ’’ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి ధన,కనక, వస్తు, వాహన ప్రాప్తి సిద్ధిస్తుంది.

అయిదో రోజు: లలితా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. లలితా అమ్మవారి చిత్రపటం ముందు దీపారాధన చేసి లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. లలితా సహస్ర నామాన్ని పూర్తిగా చదవలేని వారు ఇంట్లో లలితా అమ్మవారి చిత్రపటం ముందు కూర్చోని ‘‘శ్రీ శివశతైక్యరూపిణి లలితాంబిక’’ అనే మంత్రాన్ని జపిస్తూ చామంతి పూలతో అమ్మవారిని పూజిస్తే సంవత్సరం మొత్తం లలితాదేవి అనుగ్రహం వల్ల అఖండ ఐశ్వర్య, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. 

ఆరో రోజు: మహాలక్ష్మిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారి చిత్రపటానికి తామరవత్తులతో దీపారాధన చేయాలి. మహలక్ష్మిదేవిని మల్లి, జాజి, గులాబి పూలతో పూజించాలి. ఈ రోజు అమ్మవారిని ‘‘మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ’’ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపిస్తే సంవత్సరం మొత్తం అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.

ఏడో రోజు: అమ్మవారు సరస్వతీదేవిగా  దర్శనమిస్తారు.ఇంట్లో అమ్మవారి చిత్రపటానికి తెల్లటిపూలతో పూజచేయాలి. అలాగే తెలుపు రంగు పదార్థాలతో నైవేద్యం సమర్పించాలి.

ఎనిమిదో రోజు: అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తారు. ఇంట్లో అమ్మవారి చిత్రపటానికి ఎర్రటి పూలతో పూజచేయాలి. అమ్మవారి పటం ముందు నాలుగు వత్తులు విడివిడిగా వేసి నువ్వులనూనెతో  దీపారాధన చేయాలి. ‘‘దుర్లభా దుర్గమా దుర్గా దుఖహంత్రీ సుఖప్రదా యై నమః’’ అనే మంత్రాన్ని జపించాలి. దీని వల్ల నరఘోష, దృష్టి దోషం, అంతఃశత్రు బాధలనుంచి సులభంగా బయటపడొచ్చు.

తొమ్మిదోరోజు: అమ్మవారు మహిషాసుర మర్థినిగా దర్శనమిస్తారు. ఇంట్లో అమ్మవారి చిత్రపటానికి రకరకాల ఎర్రటి పుష్పాలతో పూజించాలి. ‘‘అపర్ణా చండికా చండముండాసుర నిఘాధిని’’ అనే మంత్రాన్ని జపింస్తూ గంటని గట్టిగా మోగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఏమైనా దుష్టశక్తులంటే  అవన్నీ తొలగిపోతాయి. భూత ప్రేత పిశాచ బాధలనుంచి బయటపడతారు. శత్రు బాధలు తొలగుతాయి.

పదోరోజు: అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తారు. ఇంట్లో అమ్మవారి చిత్రపటం ముందు దీపారాధన చేసి అరటి పండు, కొబ్బరి కాయ నైవేద్యం గా సమర్పించాలి. ‘‘రాజరాజేశ్వరీ రాజ్యధాయని రాజ్యవల్లభయేనమో నమః’’ అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు, ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్న వారు విజయం సాధిస్తారు.

శత్రువులను సంహరించి అమ్మవారు అపరాజితాదేవిగా  జమ్మిచెట్టు రూపంలో  భక్తులందర్ని అనుగ్రహిస్తుంది. ఎవరైతే విజయదశమి నాడు సాయంకాలం నక్షత్ర దర్శనమయ్యాక జమ్మిచెట్టు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేసి పసుపు కుంకుమ చల్లి నీరుపోస్తారో వాళ్లు అపరాజితాదేవి కృపకి  పాత్రులవుతారు. ఆర్థికంగా మంచి పురోభివృద్ధిసాధిస్తారు. ఇలా దేవిశరన్నవరాత్రుల్లో భాగంగా ఒక్కోక్కరోజు అమ్మవారికి సంబంధించిన ఒక్కోనామాన్ని జపించడం, ఒక్కోవిధంగా పూజించడం వల్ల  అన్ని సమస్యలు తొలగిపోయి ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవిస్తారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.