close

తాజా వార్తలు

ఎవరిని ప్రేమించాలి?
నేను, ఒక అబ్బాయి రెండేళ్లు ప్రేమించుకున్నాం. ఆ తరువాత అతడు ‘నన్ను మర్చిపో. నేను వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నా’ అని చెప్పాడు. బతిమాలినా కూడా వినిపించుకోలేదు. ఈ మధ్య నాకు మరో అబ్బాయి పరిచయం అయ్యాడు. అతడు కూడా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఈ అబ్బాయి చాలా మంచివాడు. ఈ విషయం తెలిసి మొదటి అబ్బాయి మళ్లీ వచ్చాడు. ప్రేమిస్తున్నానంటూ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు నన్ను ప్రేమించే అబ్బాయి నాతో జీవితాంతం ఉంటాడనే నమ్మకం ఉంది. నేనేం చేయాలి?
- ఓ సోదరి
 

మీరు మొదట ఒక అబ్బాయిని ప్రేమించారు. ఆ అబ్బాయి మానసిక ప్రవర్తనను ఎంత వరకు అంచనా వేశారో ఉత్తరంలో రాయలేదు. రెండేళ్ల తరువాత అతడు మరో అమ్మాయిని ప్రేమించాడంటే మీ ఎంపికలో లోపం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు మరో అబ్బాయి పరిచయమయ్యాడు. ఇతడు మంచి వాడంటూనే మొదటి అబ్బాయితో పోలుస్తున్నారు.  ఒకరితో బంధం తెగిపోయినప్పుడు మనం దానిని వదిలిపెట్టాలి. ఇంకో అమ్మాయిని ప్రేమించే వ్యక్తికి మళ్లీ ఎందుకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు... మీరింకా మొదటి వ్యక్తిని మరిచిపోయినట్లు లేరు. ఇద్దరినీ మనసులో పెట్టుకుంటే ఇద్దరూ గుర్తుకొస్తారు. పాత గాయం మాననప్పుడు కొత్త జీవితం ప్రారంభించడం అసాధ్యం. అందుకే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రెండో అబ్బాయి మీతో జీవితాంతం ఉంటాడనే నమ్మకం ఉందని రాశారు. అతను ఆ విషయం స్పష్టం చేశాడా... అనేది మీరు రాయలేదు. మీరిద్దరూ ప్రేమించుకుంటే సరిపోదు. మధ్యలో ఒక సమాజం కూడా ఉంది. మీ తల్లిదండ్రులకు కూడా అబ్బాయి నచ్చాలి. అబ్బాయి యోగ్యుడా కాదా అనేది చూడాలి. అతడి చదువు, ఉద్యోగం, ఇతర ప్రత్యేకతల్ని పెద్దవాళ్లు తప్పనిసరిగా గమనిస్తారు. అంచనావేస్తారు. కాబట్టి పెళ్లివరకూ వెళ్లేముందు మీకంటూ ఓ స్పష్టత తెచ్చుకోండి. మీ జీవితంలో ఎప్పుడూ మంచి కోరే వారితోనే ముందుకు వెళ్లడం ఉత్తమం. తొందరపాటులో ఏ నిర్ణయం తీసుకోకపోవడమే మంచిది.
మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడే ఎన్నో రకాలుగా ఆలోచించి అన్నింటికంటే మంచిది ఎంచుకుంటాం. మనం కొన్న చీర బాగోలేదని ఏ ఒక్కరు అన్నా మన మనసు గాయపడుతుంది. అలాంటిది జీవిత భాగస్వామి ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలిగా... కాబట్టి అన్నింటినీ కొంతకాలం పక్కన పెట్టేసి, మీకంటూ ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోండి. జీవితంలో మీరు చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇలా మానసికంగా కుంగిపోతూ ఉంటే ఇతర విషయాలపై దృష్టిపెట్టలేరు. పోటీ పరీక్షలు, ఇతర వ్యాపకాలు పెట్టుకోవడం వల్ల ఈ విషయాల నుంచి మీ మనసు మళ్లుతుంది. మొదటి అబ్బాయి వేరొక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు కాబట్టి అతడికి బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ చెప్పేసి సంతోషంగా ఉండమనండి. ఇక, రెండో అబ్బాయితో మాట్లాడి మీ సందేహాలు, భయాలన్నీ తీర్చుకోండి. మీ అమ్మానాన్నల ఆలోచనల్ని కూడా తెలియజేయండి. మీ అమ్మనాన్నలకు నచ్చుతాడా లేదా అనేది ముఖ్యమేనని స్పష్టం చేయండి. అతను మీకు మంచి జీవితాన్ని, ఆనందాల్ని ఇస్తాడని మీరు నమ్మితే... అదే విషయాన్ని పెద్దవాళ్లకు కూడా చెప్పండి. వాళ్లు కూడా అర్థం చేసుకుంటారు. మీ పెళ్లికీ ఒప్పుకోవచ్చు.

మీ ప్రశ్నలు ఇకపై ‌vasupsych@eenadu.net కు పంపించగలరు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.