close

తాజా వార్తలు

కంపెనీలు, విద్యార్థుల వారధి ‘స్కిల్‌-సింక్‌’

కంపెనీలు, విద్యార్థుల వారధి ‘స్కిల్‌-సింక్‌’

మీకో వ్యాపారం ఉంది. లేదా ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. మీరేం కోరుకుంటారు? తక్కువ ఖర్చుతో అద్భుతమైన తెలివితేటలు, సృజనాత్మకత ఉండి ప్రభావవంతంగా పనిచేసే మానవ వనరులనే కదా! మరో ప్రశ్న. మీరు పాఠశాలలో చదువుకుంటున్నప్పుడే పరిశ్రమలో భాగమై ముందుగానే ఉద్యోగ అనుభవం పొందితే బాగుండేదని అనుకున్నారా? ఇప్పుడీ రెండూ సాధ్యమే. ఓ ఇద్దరు పాఠశాల విద్యార్థులు డిజిటల్‌ సాంకేతికతను ఉపయోగించి మంచి ఉపాయం కనిపెట్టారు.

ఓక్రిడ్జ్‌ పాఠశాల విద్యార్థులు మానవ్‌ ఖైతాన్‌, వినయ్‌ కనిగిచెర్ల ఓ అద్భుత ఆన్‌లైన్‌ వేదికను ప్రతిపాదించారు. దాని పేరే ‘స్కిల్‌ - సింక్‌’. మెటామార్ఫాసిస్‌‌, ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌‌ పాఠశాల ఈ మధ్యనే ‘స్కూల్‌ప్రెన్యూర్‌ సదస్సు -2018’ని సంయుక్తంగా నిర్వహించాయి. పాఠశాల స్థాయిలోనే దేశంలోని అత్యుత్తమ ఆలోచలను పంచుకోవడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. దేశవ్యాప్తంగా చాలామంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. 35 మంది ఫైనల్‌కు ఎంపికయ్యారు. మొత్తం 700 ఆలోచనలు ప్రతిపాదించారు. అందులో మానవ్‌, వినయ్‌ ప్రతిపాదించిన ‘స్కిల్‌ - సింక్‌’ ఉత్తమ ఆలోచనగా ఎంపికైంది.

తెలివితేటలు, నైపుణ్యాలున్న విద్యార్థులు ఆయా సంస్థలకు అవసరమైన సేవలు, ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఉపయోపడే వేదికే ‘స్కిల్‌ - సింక్‌’. ఆన్‌లైన్‌ ఆధారంగా సేవలిందించే ఈ ప్రతిపాదన ఎంతో మందిని ఆకట్టుకుంది. అటు మధ్య తరహా సంస్థలకు, ఇటు విద్యార్థులకు లాభదాయకమైన ఆలోచన. వివిధ సంస్థలకు పనిచేయడం వల్ల విద్యార్థులకు పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలు ముందుగానే అబ్బుతాయి. తగిన అనుభవం లభిస్తుంది. సూక్ష్మ, చిన్న తరహా సంస్థలకు ఖర్చు పరంగా ఆదా అవుతుంది. ఎక్కువ మంది విద్యార్థులు అందుబాటులో ఉండటంతో తక్కువ ధరకే పని పూర్తవుతుంది.

కంపెనీలు, విద్యార్థుల వారధి ‘స్కిల్‌-సింక్‌’

ఈ ‘స్కిల్ -‌ సింక్’‌ వేదికలో కంపెనీలు ముందుగానే ప్రత్యేక విభాగంలో తమ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కావాల్సినవి ఏంటో తెలియజేస్తాయి. పూర్తైన తర్వాత చెల్లించే ధరను వివరిస్తాయి. కంపెనీలు అప్‌లోడ్‌ చేసిన ప్రాజెక్టుల్లో విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్నవాటిని ఎంపిక చేసుకోవచ్చు. పని పూర్తి చేసిన తర్వాత కంపెనీలు ఆ ప్రాజెక్టుకు, విద్యార్థికి రేటింగ్‌ ఇచ్చే సౌలభ్యం ఉంది. విద్యార్థులు మరింత శ్రద్ధగా పని చేసేందుకు, తెలివైన వారిని ఆకర్షించేందుకు కంపెనీలు తమ అసైన్‌మెంట్లను ప్రీమియం విభాగంలో ఉంచేందుకు క్రెడిట్‌ పాయింట్లు కొనుగోలు చేసుకోవచ్చు.

‘ఎంతో సామర్థ్యమున్న స్కిల్‌ - సింక్‌ చాలా పెద్ద సమస్యకు పరిష్కారం చూపింది. ఈ ఆలోచన అందరికీ ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో భారీ వ్యాపారానికి అవకాశం ఉంది. స్కూల్‌ప్రెన్యూర్‌ సమ్మిట్‌-2018 గెలిచినందుకు మానవ్‌, వినయ్‌, ఓక్రిడ్జ్‌ పాఠశాలకు అభినందనలు’ అని మెటామార్ఫాసిస్‌ స్థాపకులు పవన్‌ అల్లెన తెలిపారు. ‘భారత్‌లో దాదాపు 5.1 కోట్ల చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు ఉన్నాయి. వీటన్నిటికీ సేవలందించే సామర్థ్యం స్కిల్‌- సింక్‌కు ఉంటుంది. కోట్ల మంది విద్యార్థులకు చక్కటి అవకాశాలు దక్కుతాయి’ అని మానవ్‌, వినయ్‌ అంటున్నారు. భవిష్యత్తులో తమ ‘స్కిల్ - సింక్’ ‌ వేదికను వాణిజ్య స్థాయిలో ప్రచారం చేస్తామని తెలిపారు.

 (ప్రకటన)


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.