
తాజా వార్తలు
హైదరాబాద్: దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నవంబర్‌లో మొదలైన మొదటి షెడ్యూల్ ఇటీవల పూర్తైంది. ఈరోజు నుంచి రెండో భారీ షెడ్యూల్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రవర్గాలు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాయి. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించారు. కథానాయికల వివరాలు, ఇతర తారాగణానికి సంబంధించిన వివరాలు ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రానికి ‘రామ రావణ రాజ్యం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ భామ అదితి రావు హైదరిని ఓ కథానాయికగా ఎంపికచేసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. సినిమా చిత్రీకరణను త్వరగా పూర్తిచేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు ఫిలిం వర్గాల సమాచారం. ఈ చిత్రం కోసం చరణ్, తారక్‌లను రాజమౌళి పది నెలలు సమయం అడిగినట్లు తెలుస్తోంది. ఇందుకు వారు కూడా ఒప్పుకొన్నారని, ‘ఆర్ ఆర్ ఆర్’ పూర్తయ్యేవరకు మరో సినిమా చిత్రీకరణను మొదలుపెట్టరని టాలీవుడ్ టాక్.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- పాక్‌పై అక్షింతలు వేసిన అమెరికా
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు
- పార్టీ వీడను, కానీ: పంకజ ముండే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
