Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 47246
            [news_title_telugu_html] => 

భవిష్యత్తు అత్యుత్తమ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌

[news_title_telugu] => భవిష్యత్తు అత్యుత్తమ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ [news_title_english] => KL Rahul has capability of becoming the next big thing in Indian cricket says Sunil Gavaskar‌ [news_short_description] => టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ ప్రస్తుతం ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. వరుసగా అన్ని మ్యాచుల్లో విఫలం అవుతున్నాడు. అతడు అద్భుతంగా ఆడుతున్న రోజుల్లో బ్యాకప్‌ ఓపెనర్‌గా ... [news_tags_keywords] => kl rahul, sunil gavaskar, big thing, indian cricket [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-01-23 00:22:51 [news_isactive] => 1 [news_status] => 2 ) )
భవిష్యత్తు అత్యుత్తమ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ - KL Rahul has capability of becoming the next big thing in Indian cricket says Sunil Gavaskar‌ - EENADU
close

తాజా వార్తలు

భవిష్యత్తు అత్యుత్తమ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌

గావస్కర్‌

భవిష్యత్తు అత్యుత్తమ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌

ముంబయి: టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ ప్రస్తుతం ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. వరుసగా అన్ని మ్యాచుల్లో విఫలం అవుతున్నాడు. అతడు అద్భుతంగా ఆడుతున్న రోజుల్లో బ్యాకప్‌ ఓపెనర్‌గా రిజర్వు బెంచీపై కూర్చోబెట్టారు. ఆత్మవిశ్వాసం దెబ్బతినడం, కఠోర సాధన లేకపోవడంతో ప్రస్తుతం పరుగులు చేయడం లేదు. ఇక హార్దిక్‌ పాండ్యతో కలిసి కాఫీ విత్‌ కరణ్‌ షోకు వెళ్లడంతో సస్పెషన్ వేటుకు గురయ్యాడు. కాగా భారత క్రికెట్‌లో మున్ముందు అత్యుత్తమంగా మారగలిగే సత్తా కేఎల్‌ రాహుల్‌కు ఉందని దిగ్గజ క్రికెటర్‌ సునిల్‌ గావస్కర్‌ అన్నారు.

‘పేలవ టెక్నిక్‌, మానసిక దౌర్భల్యంతో రాహుల్‌ ఇబ్బంది పడుతున్నాడు. పరుగులు చేయకపోవడంతో ఆత్మవిశ్వాసం కొరవడింది. నేనింతకు ముందూ చెప్పాను. అతడు భారత క్రికెట్‌లో అత్యుత్తమంగా మారతాడు. బ్యాటింగ్‌ సహా అతడిని వెనక్కి లాగుతున్న అంశాలపై దృష్టి సారిస్తే అత్యుత్తమం అయ్యే సత్తా ఉందని నేనిప్పటికీ నమ్ముతున్నా. అతడి ప్రాథమిక కదలికలపై ఆలోచించాల్సి ఉంది. సచిన్‌ తెందుల్కర్‌ కాస్త ముందుకు జరిగి ఆడతాడు. మరీ ముందుకు కాదు. పక్కకు కాదు. అందుకే ముందుకూ, వెనక్కీ అవసరం మేరకు రాగలుగుతాడు. రాహుల్‌ పరిస్థితి అలా లేదు. అతడు అడుగు వెనక్కి వేసినప్పుడు అవసరమైతే మళ్లీ ముందుకు రాలేకపోతున్నాడు. అతడి గురుత్వాకర్షణ కేంద్రం ముందుకు జరగడంతో బంతిని ఆలస్యంగా ఆడలేకపోతున్నాడు’ అని గావస్కర్‌ అన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.