close

తాజా వార్తలు

కొన్ని రైళ్ల వేగం 120 కి.మీ.కు పెంపు

కాజీపేట, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌-కాజీపేట, బల్లార్షా- విజయవాడ మార్గంలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు కలిగి ఉన్న రైళ్ల వేగాన్ని పెంచారు. ఇప్పటివరకు గంటకు 110 కి.మీ వేగంతో రైళ్లు వెళుతుండగా, ఇకనుంచి 120 కి.మీ.కు పెంచుతూ రైల్వేశాఖ ఉత్తర్వులు జారీచేసింది. రైలుపట్టాలను ఈ వేగానికి అనుగుణంగా ఇటీవలే రూపొందించినందున, రైళ్ల వేగం పెంచుతున్నట్లు పేర్కొంది. 14816/15 హిమసాగర్‌, 22816 బిలాస్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌, 12625 కేరళ ఎక్స్‌ప్రెస్‌, 12193 యశ్వంతాపూర్‌ జబల్‌పూర్‌, 12269 చెన్నై- దురంతో, 12390 గయ, 22415 ఏపీ ఎక్స్‌ప్రెస్‌, 15016 యశ్వంతపూర్‌ గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లతో కలిపి ఈ మార్గంలో మొత్తం 20 రైళ్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.