close

తాజా వార్తలు

ఆ రెండు జట్లంటే ఇష్టం : కేఎల్‌ రాహుల్

మొహాలీ : కింగ్స్‌ ఎలెవన్‌ జట్టులో కీలకమైన బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్. గత మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై 75 పరుగులు చేసి తన జట్టుకు విజయాన్ని అందించాడు. 2018 ఐపీఎల్‌ సీజన్లో 55 సగటుతో 659 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అత్యంత ప్రమాదకరమైన ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. తనదైన రోజున ఎంతపెద్ద జట్టునైనా మట్టికరిపించే సత్తా ఉన్న బ్యాట్స్‌మన్‌. గేల్‌తో బ్యాటింగ్‌ ఎంజాయ్‌ చేస్తానంటున్న ఈ కుడిచేతివాటం క్లాసికల్‌ బ్యాట్స్‌మన్‌.. ఈసారి ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచేందుకు పంజాబ్‌కు పుష్కలంగా అవకాశాలున్నాయంటున్నాడు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ పలు విషయాలు పంచుకున్నాడు.
‘మా జట్టులో సత్తా ఉన్న యువ ఆటగాళ్లు ఉన్నారు. జట్టు మొత్తం బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో సమతూకంగా ఉంది. గత ఏడాది చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. అన్ని విభాగాల్లోనూ సమష్టిగా రాణిస్తాం. గేల్‌, నేను కలిసి చేసే భాగస్వామ్యాల కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూస్తుంటారో మాకు తెలుసు. ప్రతి మ్యాచ్‌లోనూ గేల్‌తో కలిసి పెద్ద భాగస్వామ్యాలు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తుంటా’నని పేర్కొన్నాడు. యూనివర్స్‌ బాస్‌(గేల్‌)తో కలిసి బ్యాటింగ్‌ చేయడం చాలా సరదాగా ఉంటుంది. మైదానం ఆవల కూడా గేల్‌ చాలా స్నేహంగా ఉంటాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడటం నా కెరీర్‌లో అద్భుతమైన సమయం. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం రావడం నిజంగా అదృష్టం. సన్‌ రైజర్స్‌ తరఫున ఆడినప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాను. నా మనసులో ఆర్‌సీబీ, సన్‌ రైజర్స్‌కు ప్రత్యేక స్థానం ఉందన్నాడు. టోర్నమెంట్‌లో ఇంకా చాలా మ్యాచ్‌లు ఉన్నాయి. మన్కడింగ్‌ గురించి మేము ఆలోచించడం లేదు. సానుకూల దృక్పథంతో ముందుకెళతాం. రానున్న మ్యచుల్లో విజయాలు సాధించడంపైనే దృష్టి పెడతామని రాహుల్‌ పేర్కొన్నాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.