close

తాజా వార్తలు

ఆప్‌తో చర్చలు జరపడం లేదు: కాంగ్రెస్‌

 దిల్లీ: హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పొత్తు కోసం ఆప్‌తో సహా ఏ పార్టీతోనూ చర్చలు జరపడం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. త్వరలోనే ఈ రెండు రాష్ట్రాల్లో పోటీచేయనున్న తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా తెలిపారు. ఆదివారం దిల్లీలో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార గీతం విడుదల సందర్భంగా ఆ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ‘పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో పొత్తు కోసం ఆప్‌తో పాటు ఏ పార్టీతోనూ సంప్రదింపులు జరపడం లేదు. త్వరలోనే ఈ రాష్ట్రాలకు తమ పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటిస్తాం. దిల్లీలో కూడా ఆప్‌తో పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు’ అని  తెలిపారు. ఈ విషయంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పీసీ చాకో తదితర సీనియర్‌ నాయకులతో సమావేశం నిర్వహించారు. హరియాణా, పంజాబ్‌లో తమతో కాంగ్రెస్‌ కలిసి పోటీచేస్తేనే దిల్లీలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని ఆప్‌ నాయకుడొకరు శనివారం అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తుకు ఆప్‌ మరో షరతు కూడా పెట్టింది. దిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించేందుకు కాంగ్రెస్‌ హామీ ఇస్తేనే ఆ  పార్టీకి మద్దతిస్తామని ఆప్‌ తేల్చి చెప్పింది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.