close

తాజా వార్తలు

ఐపీఎల్ ట్రోఫీతో కృష్ణుడికి నీతా పూజలు

ముంబయి: ఐపీఎల్‌ గెలుపు సంబరాల్లో మునిగి తేలుతున్నారు ముంబయి ఇండియన్స్‌ యజమాని నీతా అంబానీ. రోహిత్‌ సేన కుటుంబ సభ్యులకు యాంటిలియాలో ఆడంబరంగా పార్టీ ఇచ్చారామె.ఆ పార్టీకి ముందు శ్రీకృష్ణ భగవానుడి విగ్రహానికి ప్రార్థనలు చేశారు. ఆమె నివాసంలోని కృష్ణుడి ఆలయంలో ఐపీఎల్ ట్రోఫీని ఉంచి పూజలు నిర్వహిస్తోన్న వీడియోను విరల్ భయాని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఆలయంలోకి ప్రవేశించే ముందు ‘జై శ్రీ కృష్ణ’ అని స్మరించారు. అక్కడే ఉన్న పూజారులు ఆమె వద్ద నుంచి ట్రోఫి అందుకొని దేవుడి ముందు ఉంచారు. కొద్దిసేపు ప్రార్థనల్లో పాల్గొని , తరవాత ముంబయి ఇండియన్స్‌ జట్టుతో పార్టీలో మునిగిపోయారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన