close

తాజా వార్తలు

మోదీ జట్టిదే!

దిల్లీ: కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది.  రాష్ట్రపతి భవన్‌ వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 58 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 58 మందితో కూడిన ఈ టీమ్‌లో 25 మంది (మోదీతో సహా) కేబినెట్‌, 9 మంది స్వతంత్ర హోదా, 24మంది కేంద్ర సహాయ మంత్రులుగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణం చేయించారు. అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు విదేశీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ, సినీ, పారిశ్రామిక దిగ్గజ ప్రముఖులు హాజరయ్యారు. మోదీ టీమ్‌లో సభ్యుల గురించి సంక్షిప్తంగా..

రాజ్‌నాథ్ సింగ్
స్వస్థలం: ఉత్తర్‌ప్రదేశ్ 
నియోజకవర్గం: లఖ్‌నవూ
కీలక రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు. భాజపా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన 2014లో కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా కొలువు తీరిన ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.


అమిత్ షా
స్వస్థలం: గుజరాత్
నియోజకవర్గం: గాంధీ నగర్‌
మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర మంత్రిగా కీలక హోదాల్లో పనిచేశారు. 2014 నుంచి భాజపా జాతీయ అధ్యక్షుడిగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయ ఢంకా మోగించడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయన మోదీ మంత్రి వర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.


నితిన్‌ గడ్కరీ
స్వస్థలం: మహారాష్ట్ర
విద్యార్హతలు: నాగ్‌పూర్‌ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్యలో పట్టా పుచ్చుకున్నారు.
రాజకీయ ప్రస్థానం: తొలుత మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.2009లో భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడిగా పనిచేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నాగ్‌పూర్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. నరేంద్రమోదీ ప్రభుత్వంలో ఉపరితల రవాణా శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. ఇప్పుడు మరోసారి కేంద్రమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు.


సదానంద గౌడ
స్వస్థలం: కర్ణాటక
విద్యార్హతలు: న్యాయ శాస్త్రంలో పట్టా. ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు.
రాజకీయ ప్రస్థానం: 2004లో కాంగ్రెస్‌ నేత వీరప్ప మొయిలీపై గెలిచి లోక్‌సభలో తొలిసారి అడుగుపెట్టారు. పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2011లో కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. మోదీ తొలి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు మరోసారి అవకాశం వచ్చింది.


నిర్మలా సీతారామన్
స్వస్థలం: తమిళనాడు
విద్యార్హతలు: జేఎన్‌యూ నుంచి ఎంఫిల్‌ పూర్తి చేశారు.
రాజకీయ ప్రస్థానం: ఆంధ్రప్రదేశ్‌ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. కర్ణాటక నుంచి మరోసారి రాజ్యసభకు వెళ్లారు. 2014లో మోదీ ప్రభుత్వంలో తొలుత సహాయ మంత్రిగా సేవలందించారు. తర్వాత 2017లో రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మోదీ రెండో ప్రభుత్వంలోనూ ఆమెకు అవకాశం వచ్చింది.


రాంవిలాస్‌ పాసవాన్‌
స్వస్థలం: బిహార్‌
విద్యార్హతలు: న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు.
రాజకీయ ప్రస్థానం: 1977లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తొలిసారి జనతా తరఫున హాజీపూర్‌ నుంచి ఎన్నికయ్యారు. 2000లో లోక్‌ జనశక్తి స్థాపించారు. ఆరుగురు ప్రధాన మంత్రులతో మంత్రిగా విధులు నిర్వహించడం విశేషం. రాజకీయ జీవితంలో 8సార్లు లోక్‌సభకు, ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014లో ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.


స్మృతి ఇరానీ
స్వస్థలం: దిల్లీ
నియోజకవర్గం: అమేఠీ
బుల్లి తెరపై అత్యంత జనాదరణ పొందిన నటి. 2014 ఎన్నికల్లో అమేఠీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీద పోటీ చేసి, గతంలో చాందినీ చౌక్‌లో కపిల్‌ సిబల్‌పై పోరాటానికి గుర్తుగా మంత్రి పదవిని దక్కించుకున్నారు. తాజాగా ఎన్నికల్లో అమేఠీలో రాహుల్ గాంధీపై పోటీ చేసి అనూహ్య విజయాన్ని, పార్టీలో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. నేడు మోదీ మంత్రి వర్గంలో కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.


ప్రకాశ్ జవదేకర్‌
స్వస్థలం: మహారాష్ట్ర
పార్టీ తరఫున టీవీ చర్చల్లో ప్రస్తిద్ధుడు.  ఎన్డీఏ ప్రభుత్వంలో మానవ వనరులు శాఖ మంత్రిగా పనిచేశారు. రాజ్య సభ సభ్యుడిగా మరోసారి మంత్రి పదవిని చేప్టటారు.


హర్‌సిమ్రత్ కౌర్‌
స్వస్థలం: పంజాబ్
నియోజకవర్గం: భటిండా
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ కోడలు. శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ సతీమణి.  బాలికా సంరక్షణకు కృషి చేసే ‘నాన్హీ ఛాన్‌’ కార్యక్రమంలో చరుగ్గా పాల్గొంటారు.  ఎన్డీఏ ప్రభుత్వంలో ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.


గిరిరాజ్‌ సింగ్
స్వస్థలం: బిహార్
నియోజకవర్గం: బెగుసరాయ్‌
2014లో లోక్‌సభకు ఎన్నికై మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2002 నుంచి 2014 వరకు ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించారు.


నరేంద్ర సింగ్‌ తోమర్‌
స్వస్థలం: మధ్యప్రదేశ్‌
విద్యార్హతలు: డిగ్రీ
రాజకీయ ప్రస్థానం: 2009లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు. 2014లో ఉక్కుశాఖ మంత్రిగా నియమితులయ్యారు. 2016 నుంచి వేర్వేరు శాఖలకు మంత్రిగా సేవలందిస్తున్నారు.


రవిశంకర్‌ ప్రసాద్‌
స్వస్థలం: బిహార్‌
విద్యార్హతలు: న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. వృత్తి: పట్నా హైకోర్టు, సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు. దాణా కుంభకోణంపై వ్యాజ్యం వేసిన బృందంలో ఈయన సభ్యుడు. అయోధ్య భూవివాదంలో రామ్‌లాలా తరఫున వాదనలు వినిపించారు.
రాజకీయ ప్రస్థానం: 2000లో తొలిసారి రాజ్యసభ్యకు ఎన్నికయ్యారు. వాజ్‌పేయీ ప్రభుత్వంలో పలు శాఖలకు మంత్రిగా సేవలందించారు. దీంతోపాటు పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. మోదీ తొలి ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్స్‌, సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. మోదీ తదుపరి ప్రభుత్వంలోనూ ఈయనకు అవకాశం వచ్చింది.


థావర్‌ చంద్ గహ్లోత్‌
స్వస్థలం: మధ్యప్రదేశ్‌
విద్యార్హతలు: బీఏ
రాజకీయ ప్రస్థానం: తొలిసారిగా 1996లో లోక్‌ సభకు ఎన్నికయ్యారు. పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా సేవలందించారు. 2014లో సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.


ఎస్‌. జయశంకర్‌
స్వస్థలం: తమిళనాడు
వృత్తి: 1977లో ఇండియన్‌ ఫారెన్‌ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. 2018 వరకు విదేశీ వ్యవహారాల శాఖలో కీలక పదవులు చేపట్టారు. చైనా, అమెరికాల్లో భారత రాయబారిగా విధులు నిర్వహించారు. 2015 నుంచి 2018 వరకు విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఈయన చట్ట సభలకు ఎన్నిక కాకుండానే మంత్రి వర్గంలో చోటు దక్కించుకోవడం విశేషం.


రమేశ్‌ పోఖ్రియాల్‌
స్వస్థలం: ఉత్తరాఖండ్‌
విద్యార్హతలు: పీహెచ్‌డీ
రాజకీయ ప్రస్థానం: 1991లో కర్ణప్రయాగ నియోజకవర్గం నుంచి ఉత్తర్‌ ప్రదేశ్‌ శాసన సభకు ఎన్నికయ్యారు. 1997లో ఉత్తరాంచల్ అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఉత్తరాఖండ్‌ శాసన సభకు రెండుసార్లు ఎన్నికయ్యారు. 2009 నుంచి 2011 వరకు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2014లో తొలిసారి లోక్‌ సభకు ఎన్నికయ్యారు. 2019లో రెండో సారి లోక్‌ సభకు ఎన్నికయ్యారు.


అరవింద్ సావంత్
స్వస్థలం: మహారాష్ట్ర 
నియోజక వర్గం: దక్షిణ ముంబయి 
2014లో తొలిసారి లోక్‌సభకు  ఎన్నికయ్యారు. రెండు సార్లు మహారాష్ట్ర శాసనమండలికి ఎన్నికయ్యారు


రావ్ ఇంద్రజిత్ సింగ్
స్వస్థలం: హరియాణా
నియోజక వర్గం: గురుగ్రామ్
నాలుగు సార్లు హరియాణా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 1998లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు.  తరవాత వరసగా 2004 నుంచి 2019లో లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  2014 మోదీ హయాంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.


ప్రహ్లాద్ జోషి
స్వస్థలం: కర్ణాటక 
నియోజక వర్గం: ధార్వాడ్ 
2012లో కర్ణాటక రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. వరసగా 2004 నుంచి 2019 వరకు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


జితేంద్ర సింగ్
స్వస్థలం: జమ్ముకశ్మీర్
నియోజక వర్గం: ఉదంపూర్
వైద్య శాస్త్రంలో పట్టా పొందిన జితేంద్ర సింగ్ ఫిజీషియన్‌గా సుదీర్ఘకాలం సేవలు అందించారు. 2014లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికై , కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.


గజేంద్ర సింగ్‌ షెకావత్‌
స్వస్థలం: రాజస్థాన్‌
విద్యార్హతలు: ఎంఫిల్‌
రాజకీయ ప్రస్థానం: 1992 నుంచి ఏబీవీపీలో చురుకైన పాత్ర పోషించారు. 2014లో తొలిసారి లోక్‌ సభకు ఎన్నికయ్యారు. 2017లో వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2019లో జోధ్‌పూర్‌ నుంచి లోక్‌ సభకు రెండోసారి ఎన్నికయ్యారు.


సంతోష్‌ గాంగ్వర్‌
స్వస్థలం: ఉత్తర్‌ ప్రదేశ్‌
విద్యార్హతలు: బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ
రాజకీయ ప్రస్థానం: 1996 వరకు బరేలీ అర్బన్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో తొలిసారి లోక్‌ సభకు ఎన్నికయ్యారు. 2014లో జౌళి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2016 జులై నుంచి 2017 సెప్టెంబరు వరకు ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2017 సెప్టెంబరు నుంచి కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.


కిరణ్‌ రిజిజు
స్వస్థలం: అరుణాచల్‌ ప్రదేశ్‌
విద్యార్హతలు: న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు.
రాజకీయ ప్రస్థానం: 2004లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు.


ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌
స్వస్థలం: మధ్య ప్రదేశ్‌
రాజకీయ ప్రస్థానం: వాజ్‌పేయీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2014, 2019 ఎన్నికల్లో దమోహ్‌ నుంచి లోక్‌ సభకు ఎన్నికయ్యారు. 1999లో తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు.


మనసుఖ్‌ మాండవియా
స్వస్థలం: గుజరాత్‌
రాజకీయ ప్రస్థానం: 2002లో గుజరాత్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2012లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.


అర్జున్ రామ్ మేఘవాల్
స్వస్థలం: రాజస్థాన్
నియోజకవర్గం: బికనీర్ 
తొలుత రాష్ట్ర సర్వీసుల్లో చేరి ఐఏఎస్‌గా పదోన్నతి పొందారు. 2009, 2014, 2019లో లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 2016లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.


అశ్వనీ కుమార్ చౌబే
స్వస్థలం: బిహార్ 
నియోజకవర్గం: బక్సార్‌
గతంలో బిహార్ ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 16 లోక్‌సభకు బక్సార్‌ నుంచి ప్రాతినిధ్యం వహించడానికి ముందు భాగల్ పుర్‌ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2017లో మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా చేరారు. 2019లో మరోసారి బక్సార్‌ నుంచి గెలుపొంది కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.


వీకే సింగ్‌
స్వస్థలం: పంజాబ్‌
విద్యార్హత: నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో చదువుకున్నారు. భారత సైన్యంలో వివిధ హోదాల్లో సేవలందించారు.
రాజకీయ ప్రస్థానం: 2010 నుంచి 2012 వరకు సైన్యాధ్యక్షుడిగా విధులు నిర్వహించారు. 2014లో తొలిసారి లోక్‌ సభకు ఎన్నికయ్యారు. 2014 నుంచి విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.


ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే
స్వస్థలం: మధ్య ప్రదేశ్
రాజకీయ ప్రస్థానం: మాండ్లా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1996 నుంచి 2009 వరకు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. మోదీ తొలి ప్రభుత్వంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.


హర్‌దీప్‌సింగ్‌ పూరీ
స్వస్థలం: పంజాబ్‌
విద్యార్హతలు: యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ నుంచి మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌.
రాజకీయ ప్రస్థానం: 1988-91 మధ్య పలు దేశాల్లో దౌత్య సేవలు. ఐరాస భద్రతా మండలి ఉగ్రవాదంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీకి ఛైర్మన్‌గా పని చేశారు. 2013 జూన్‌లో అంతర్జాతీయ శాంతి సంస్థకు సీనియర్‌ సలహాదారుగా నియమితులయ్యారు. 2014లో భాజపాలో చేరిక. 2018 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.


రాజ్‌కుమార్‌ సింగ్‌
స్వస్థలం: బిహార్‌
విద్యార్హతలు: మగధ్‌ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా.
రాజకీయ ప్రస్థానం: 1975 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. వాజ్‌పేయీ హాయాంలో హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2014 నుంచి బిహార్‌లోని అరా నియోజకవర్గ ఎంపీగా ఉన్నారు. 2017లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు.


కృష్ణపాల్‌ గుర్జార్‌
స్వస్థలం: హరియాణా
విద్యార్హతలు: మేరఠ్‌ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా
రాజకీయ ప్రస్థానం: 2014 నుంచి ఫరీదాబాద్‌ నియోజకవర్గ ఎంపీగా ఉన్నారు. ఇదే సమయంలో సామాజిక, న్యాయశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.


పురుషోత్తం రూపాలా
స్వస్థలం: జరాత్‌
విద్యార్హతలు: బీఎస్సీ, బీఈడీ
రాజకీయ ప్రస్థానం: 1988లో భాజపాలో చేరారు. మూడుసార్లు గుజరాత్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.  గుజరాత్‌ సాగునీటి మంత్రిగానూ సేవలందించారు. 2008, 2016లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ సహాయ మంత్రిగా, 2017లో వ్యవసాయశాఖ సహాయ మంత్రిగా సేవలందించారు.


జి కిషన్‌ రెడ్డి
స్వస్థలం: తెలంగాణ
నియోజకవర్గం: సికింద్రాబాద్‌
విద్యార్హతలు: సీఐడీటీ నుంచి టూల్‌ డిజైనింగ్‌లో డిప్లమా
రాజకీయ ప్రస్థానం: 2002 నుంచి 2005 మధ్య బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ఎన్నికయ్యారు. 2009, 2014లో అంబర్‌ పేట నుంచి అసెంబ్లీకి ఎన్నియ్యారు. తెలంగాణలో తొలి భాజపా అధ్యక్షుడిగా పనిచేశారు.


నిత్యానంద్‌ రాయ్‌
స్వస్థలం: బిహార్‌
రాజకీయ ప్రస్థానం: 2014లో ఉజియాపూర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2016లో భాజపా బిహార్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.


రాందాస్‌ అథవాలే
స్వస్థలం: మహారాష్ట్ర
విద్యార్హతలు: సిద్ధార్థ్‌ కాలేజ్‌ నుంచి డిగ్రీ
రాజకీయ ప్రస్థానం: 1990లో మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా ఎన్నిక. 1999, 2004లో లోక్‌సభకు ఎన్నిక. 2014లో రాజ్యసభకు ఎన్నిక. 2016లో కేంద్ర మంత్రి పదవి.


సాధ్వి నిరంజన్‌ జ్యోతి
స్వస్థలం: ఉత్తర్‌ప్రదేశ్‌
రాజకీయ ప్రస్థానం: 2012లో యూపీ అసెంబ్లీకి తొలిసారి ఎన్నిక. 2014లో ఫతేపూర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నిక.
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు.


బాబుల్‌ సుప్రియో
స్వస్థలం: పశ్చిమ బంగాల్‌
విద్యార్హతలు: బీకాం
రాజకీయ ప్రస్థానం: పలు చిత్రాలకు నేపథ్యగానం. 2014 ఏడాది అసన్‌సోల్‌ నుంచి లోక్‌సభకు ఎన్నిక. పలు శాఖలకు సహాయ మంత్రిగా సేవలు. 2019లో తృణమూల్‌ అభ్యర్థి మూన్‌మూన్‌సేన్‌పై గెలుపు.


సంజయ్‌ శ్యాంరావ్‌ ధోత్రే
స్వస్థలం: మహారాష్ట్ర
విద్యార్హతలు: ఇంజినీరింగ్‌
రాజకీయ ప్రస్థానం: 2004లో తొలిసారి లోక్‌సభకు ఎన్నిక.


అనురాగ్‌ ఠాకూర్‌
స్వస్థలం: హిమాచల్‌ ప్రదేశ్‌
విద్యార్హతలు: బీఏ
రాజకీయ ప్రస్థానం: దేశవాళీ క్రికెట్‌ ఆటగాడు. 2015లో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు. సైన్యంలో పని చేశారు. హమీర్‌పూర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నిక.


సురేశ్‌ చెన్నబసప్ప
స్వస్థలం: కర్ణాటక
విద్యార్హతలు: న్యాయ విద్య
రాజకీయ ప్రస్థానం: 2004 నుంచి వరుసగా లోక్‌సభకు ఎన్నిక


 

హర్షవర్ధన్‌
స్వస్థలం: దిల్లీ
విద్యార్హతలు: వైద్య విద్యలో పట్టా పొందారు.
రాజకీయ ప్రస్థానం: 1992లో తొలిసారి దిల్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దిల్లీ ప్రభుత్వంలో పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో చాందీన్‌చౌక్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు.


పీయూష్ గోయల్‌
స్వస్థలం: ముంబయి
విద్యార్హతలు: చార్టర్డ్‌ అకౌంటెంట్‌, న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు.
రాజకీయ ప్రస్థానం: పలు బ్యాంకుల్లో బోర్డు సభ్యుడిగా సేవలందించారు. మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014లో పలు శాఖలకు సహాయ మంత్రిగా చేశారు. 2017లో రైల్వే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.


ధర్మేంద్ర ప్రధాన్‌
స్వస్థలం: ఒడిశా
విద్యార్హతలు: ఉత్కల్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్‌.ఏ పట్టా పొందారు. 
రాజకీయ ప్రస్థానం: పలు రాష్ట్రాలకు భాజపా తరఫున ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. 2014లో పెట్రోలియం శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.


రతన్‌లాల్‌ కటారియా
స్వస్థలం: హరియాణా
విద్యార్హతలు: కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ
రాజకీయ ప్రస్థానం: 1999లో లోక్‌సభకు తొలిసారి ఎన్నిక. 2014లో అంబాలా నియోజకవర్గం నుంచి గెలుపు.


రేణుకా సింగ్‌
స్వస్థలం: ఛత్తీస్‌గఢ్‌ 
రాజకీయ ప్రస్థానం: 2003 నుంచి 2008 వరకూ ఛత్తీస్‌గఢ్‌ శాసనసభకు ఎన్నిక. రమణ్‌సింగ్‌ ప్రభుత్వంలో మంత్రిగా సేవలు. గిరిజన రాజకీయ నాయకురాలిగా గుర్తింపు.


సోం ప్రకాశ్‌
స్వస్థలం: పంజాబ్‌
రాజకీయ ప్రస్థానం: 2019 ఎన్నికల్లో తొలిసారి లోక్‌సభకు ఎన్నిక. ఐఏఎస్‌ అధికారిగా పంజాబ్‌లో సేవలు


దేవశ్రీ చౌదరి
స్వస్థలం: పశ్చిమ బంగాల్‌
రాజకీయ ప్రస్థానం: 2019 లోక్‌సభకు తొలిసారి ఎన్నిక

 


కైలాస్‌ చౌదరి 
స్వస్థలం: రాజస్థాన్‌
రాజకీయ ప్రస్థానం: ఈ ఎన్నికల్లో బార్మర్‌ నుంచి జశ్వంత్‌సింగ్‌ కుమారుడు మానవేంద్రసింగ్‌ను ఓడించారు.


ప్రతాప్‌చంద్ర సారంగి 
స్వస్థలం: ఒడిశా
విద్యార్హతలు: బ్యాచులర్‌ డిగ్రీ
రాజకీయ ప్రస్థానం : 2004, 2009లో నీలగిరి ఎమ్మెల్యేగా ఎన్నిక. 2014లో బాలాసోర్‌ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో బిజద ఎంపీ రవీంద్రకుమార్‌పై పోటీ చేసి అదేస్థానంలో గెలుపొందారు.


రామేశ్వర్‌ తెలీ
స్వస్థలం: అసోం
రాజకీయ ప్రస్థానం : దులియాజన్‌ నుంచి తొలిసారి భాజపా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో డిబ్రూగడ్‌ నుంచి మాజీ కేంద్రమంత్రి పబన్‌ సింగ్‌ ఘటోవర్‌పై గెలుపు, తిరిగి అదేస్థానం నుంచి ఈ ఎన్నికల్లో గెలుపొందారు. 


 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.