
తాజా వార్తలు
మాండ్య ఎంపీ సుమలత
బెంగళూరు: కర్ణాటకలోని కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే అసంతృప్తితో అట్టుడికిపోతోంది. ఈ నేపథ్యంలో మాండ్య ఎంపీ సుమలత సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీఎస్‌తో పొత్తు పెట్టుకునే ముందు కాంగ్రెస్ కాస్త ఆలోచించుకుని ఉండాల్సిందన్నారు. ఇటీవల ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో సుమలత ఈ వ్యాఖ్యలు చేశారు. మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు.
‘సార్వత్రిక ఎన్నికల పట్ల నేను సంతృప్తిగానే ఉన్నాను. కానీ, మధ్యలో కొన్ని కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. రాజకీయాల్లో ఇలాంటివి సహజం. నిఖిల్ కుమారస్వామిని నేనెప్పుడూ విమర్శించను. ఎందుకంటే నాలాగా తను కూడా రాజకీయాలకు కొత్త. అతడి ఓటమికి తన కుటుంబమే కారణం. జేడీఎస్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోకుండా ఉంటే కనీసం 10 స్థానాల్లోనైనా గెలిచి ఉండేది. 2018 ఎన్నికలప్పుడు పొత్తు పెట్టుకుని ఉండాల్సింది కాదు. ఎన్నికల ముందు ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని ఉంటే కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతినేది. సగం మంది ఓటర్లు ఆ పార్టీకి వేసేవారు కాదు. పొత్తు పెట్టుకుంది కాబట్టే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు షాక్ ఎదురైంది. చాలా లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపింది. కానీ పొత్తు కారణంగా ఆ స్థానాల్లో భాజపాకు కాంగ్రెస్ మేలు చేసింది’ అని తెలిపారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- శరణార్థులకు పౌరసత్వం
- భాజపాకు తెరాస షాక్!
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- అమ్మ గురుమూర్తీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
