Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 111086
            [news_title_telugu_html] => 

ఓఎల్‌ఎక్స్‌లో అమితాబ్‌ వాడిన కారు!

[news_title_telugu] => ఓఎల్‌ఎక్స్‌లో అమితాబ్‌ వాడిన కారు! [news_title_english] => Amitabh Bachchans Old MercedesBenz SClass Put up for Sale at OLX [news_short_description] => ప్రముఖ ఆన్‌లైన్‌ మార్కెట్‌ కంపెనీ ఓఎల్‌ఎక్స్‌లో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌  వాడిన కారు అమ్మకానికి పెట్టారు. మెర్సిడెజ్‌ బెంజ్‌ ఎస్‌ క్లాస్‌ కారు రూ.9.99 లక్షలకు అమ్మకానికి పెట్టినట్లు ఓఎల్‌ఎక్స్‌ సంస్థ వెల్లడించింది [news_tags_keywords] => olx,amitabh bachchan [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-12 14:03:51 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఓఎల్‌ఎక్స్‌లో అమితాబ్‌ వాడిన కారు! - Amitabh Bachchans Old MercedesBenz SClass Put up for Sale at OLX - EENADU
close

తాజా వార్తలు

ఓఎల్‌ఎక్స్‌లో అమితాబ్‌ వాడిన కారు!

ముంబయి: ప్రముఖ ఆన్‌లైన్‌ మార్కెట్‌ కంపెనీ ఓఎల్‌ఎక్స్‌లో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ వాడిన కారును అమ్మకానికి పెట్టారు. మెర్సిడెజ్‌ బెంజ్‌ ఎస్‌ క్లాస్‌ కారు రూ.9.99 లక్షలకు అమ్మకానికి పెట్టినట్లు ఓఎల్‌ఎక్స్‌ సంస్థ వెల్లడించింది. ఈ కారుకు సంబంధించిన వివరాల్లోనూ ఇది అమితాబ్‌ వాడిన కారని, ఆ తర్వాత అమితాబ్‌ నుంచి ఓ వ్యక్తి దీనిని కొనుగోలు చేశారని పేర్కొంది. ఇప్పటివరకు ఈ కారును ఇద్దరు వాడటంతో రూ.9.99 లక్షలకే అమ్మకానికి పెట్టారని తెలిపింది. 

మార్కెట్‌లో మెర్సిడెజ్‌ బెంజ్‌ ఎస్‌ క్లాస్‌  కొత్త కారు ధర రూ.1.36 కోట్లు. కానీ, ఈ కారు రూ.9.99 లక్షలకే లభ్యమవుతుండడం, అందులోనూ ఒకప్పుడు అమితాబ్‌ వాడిన కారు కావడంతో కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారట. అమితాబ్‌ గ్యారేజ్‌లోకి ఏదన్నా కొత్త మోడల్‌ కారు చేరితే.. చాలా కాలంగా వాడుతున్న పాత కారును అమ్మేస్తారని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. 
గతంలోనూ అమితాబ్‌ తనకు ఓ దర్శకుడు కానుకగా ఇచ్చిన రూ.3.5 కోట్ల విలువైన రోల్స్‌ రాయిస్‌ ఫాంటమ్‌ కారును అమ్మేశారు. ఆ తర్వాత మెర్సిడెజ్‌ బెంజ్‌ వీ క్లాస్‌ ఎంపీవీ (మల్టీ పర్పస్‌ వెహికిల్‌)ని తన గ్యారేజ్‌లో చేర్చారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.