close

తాజా వార్తలు

‘మహా’ వర్షాలతో ముం‘భయం’గానే..

రత్నగిరిలో ఆనకట్టకు గండి.. ఆరుగురి మృతి

ముంబయి: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని ముంబయి వాసులు భయంభయంగా గడుపుతున్నారు. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగర వీధులు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా నీటమునిగాయి. చాలా చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. అటు విద్యుత్‌ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరో 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

ఆనకట్టకు గండి: ఆరుగురు మృతి

భారీ వర్షాల కారణంగా రత్నగిరిలోని తివారి ఆనకట్టకు గండిపడింది. దీంతో దిగువన ఉన్న 7 గ్రామాల్లోకి భారీగా వరదనీరను చేరింది. వరదల్లో కొట్టుకుపోయి ఇప్పటివరకు ఆరుగురు మృతిచెందగా.. మరో 22 మంది గల్లంతయ్యారు. డ్యామ్‌కు సమీపంలోని ఉన్న 12 ఇళ్లు కొట్టుకుపోయాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌, పోలీసులు, వలంటీర్లు వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. 

మలాడ్‌ ఘటనలో 23కు చేరిన మృతులు

మరోవైపు మలాడ్‌ తూర్పు ప్రాంతంలోని పింపిరీపాడాలో సోమవారం అర్ధరాత్రి గోడ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 23కు పెరిగింది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. 9 మంది చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మరో 75 మంది గాయపడ్డారు. పుణె, ఠానేలో కూడా గోడ కూలిన ఘటనలు చోటుచేసుకున్నాయి. 

వరదలో కొట్టుకుపోయిన స్కూల్‌ విద్యార్థులు

వరదల ధాటికి వాషిమ్‌ జిల్లాలో నలుగురు స్కూల్‌ విద్యార్థులు కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు ఇద్దరిని రక్షించగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. అక్కాతమ్ముళ్లయిన పూజా బాలు పవార్‌, పరాస్‌ బాలు పవార్‌ కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు. 

203 విమానాలు రద్దు..

భారీ వర్షాల కారణంగా ముంబయిలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన 203 విమానాలు రద్దయ్యాయి. ముంబయికి రావాల్సిన విమానాలను దారి మళ్లించారు. స్పైస్‌జెట్‌ విమానం కారణంగా ప్రధాన రన్‌వే దెబ్బతింది. మరమ్మతుల కారణంగా గురువారం వరకు రన్‌వేపై రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు వర్షాల కారణంగా విమానాలు రద్దవడంతో టికెట్ల డబ్బులు వెనక్కి ఇచ్చేస్తామని విమానయాన సంస్థలు ప్రకటించాయి. టికెట్‌ రద్దు రుసుము కూడా ఎత్తివేసినట్లు తెలిపాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.