close

తాజా వార్తలు

ఇతని సాహసం చూస్తేస్పైడర్‌మ్యాన్‌ అనాల్సిందే!

వాషింగ్టన్‌: ప్రముఖ హాలీవుడ్‌ చిత్రం స్పైడర్‌మ్యాన్‌లో పీటర్‌ పార్కర్‌ చేసిన విన్యాసాలు అందరూ చూసే ఉంటారు. అయితే అవన్నీ గ్రాఫిక్స్‌ లేదా ప్రత్యేక వీడియో ఎఫెక్ట్స్‌తోనే సాధ్యం. కానీ అమెరికాలో జరిగిన ఓ అగ్ని ప్రమాదం మనకు నిజంగానే ఓ స్పైడర్‌మ్యాన్‌ని చూపించింది. ఫిలడెల్ఫియాలో ఓ 19 అంతస్తుల భవనంలో హఠాత్తుగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మూడో అంతస్తులో చెలరేగిన మంటలు క్రమంగా పైకి ఎగబాకాయి. ఈ క్రమంలో దట్టమైన పొగలు మొత్తం భవనానికి వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన ప్రజలు ముందుగానే అందులో నుంచి తప్పించుకోగలిగారు. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. 

ఈ క్రమంలో దాదాపు 15వ అంతస్తులో ఉన్న ఓ యువకుడు ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి పెద్ద సాహసమే చేశాడు. ఏ ఆధారం లేకుండా స్పైడర్‌మ్యాన్‌ తరహాలో దాదాపు 14 అంతస్తులు అలవోకగా దిగేశాడు. అదీ కేవలం మూడు నిమిషాల్లోనే. ప్రమాద ఘటనను హెలికాప్టర్‌ ద్వారా కవర్‌ చేస్తున్న స్థానిక మీడియా సంస్థలు ఆ యువకుడి సాహసాన్ని వీడియోలో బందించాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే అతను ఎవరు, ఏంటి అన్నది మాత్రం తెలియరాలేదు. భవనం దిగగానే అతను అక్కడి నుంచి చకచకా వెళ్లిపోవడంతో వివరాలు సేకరించడం సాధ్యపడలేదు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.