close

తాజా వార్తలు

శర్వా సరసన ‘పెళ్లిచూపులు’ భామ

సినిమా షురూ

హైదరాబాద్‌: యువ కథానాయకుడు శర్వానంద్‌ కొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రానికి శ్రీ కార్తిక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రీతూ వర్మ కథానాయిక. ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. దీనికి సంబంధించిన చిత్రాలను నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ సినిమాని తెలుగు, తమిళంలో తెరకెక్కిస్తున్నట్లు పేర్కొంది. ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు.
శర్వా ఇటీవల ‘రణరంగం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్‌, కాజల్‌ కథానాయికలుగా నటించారు. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌‌ అందుకుంది. ప్రస్తుతం శర్వానంద్‌ తమిళ హిట్‌ ‘96’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. ఇందులో సమంత కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.