close

తాజా వార్తలు

హుజూర్‌నగర్‌పై భాజపా కోర్‌కమిటీ భేటీ

హైదరాబాద్: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో బరిలోకి దింపేందుకు ముగ్గురి పేర్లను అధిష్ఠానానికి పంపాలని భాజపా నిర్ణయించింది. అభ్యర్థి ఎంపికపై సమావేశమైన కోర్‌కమిటీ ఈమేరకు చర్చలు జరిపింది. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ భేటీకి.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు తదితరులు హాజరయ్యారు. హుజూర్‌ నగర్‌ అభ్యర్థి ఎంపికపై చర్చించారు. అధిష్ఠానం నిర్ణయం తర్వాత ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేయనున్నారు. పురపాలక ఎన్నికల్లో పార్టీ సన్నద్ధత అంశంపైనా సమావేశంలో చర్చించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.