close

తాజా వార్తలు

ఐపీఎల్‌లో చెన్నైపై కోపమెందుకో చెప్పిన శ్రీశాంత్‌

ఆప్టన్‌ ఆరోపణలపై శ్రీశాంత్‌ వివరణ

దిల్లీ: మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో అర్ధాంతరంగా క్రికెట్‌ కెరీర్‌ కోల్పోయిన టీమిండియా క్రికెటర్‌ శ్రీశాంత్‌.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుపై తనకెందుకంత కోపమో చెప్పాడు. ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పష్టతనిచ్చిన అతడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ కోచ్‌ పాడీ ఆప్టన్‌ ఇటీవల విడుదల చేసిన ఆటోబయోగ్రఫీలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుపై శ్రీశాంత్‌ని ఆడించకపోవడం వల్లే తనను అసభ్యంగా దూషించాడని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ వివరణ ఇచ్చాడు.

‘మిస్టర్‌ ఆప్టన్‌, మీ మనసు, పిల్లలపై చేతులు పెట్టి చెప్పండి, భారత జట్టులో లేదా ఐపీఎల్‌లో నేనెప్పుడైనా మిమ్మల్ని దూషించానా? అలాగే నేనెంతగానో అభిమానించి, గౌరవించే రాహుల్‌ ద్రవిడ్‌ను ఈ సందర్భంగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. నేనెప్పుడైనా అతడితో గొడవపడ్డానా?ఆప్టన్‌ తన పుస్తకంలో రాసినట్లు దూషించానా?’ అని శ్రీశాంత్‌ పేర్కొన్నాడు. అయితే, చెన్నై జట్టుపై ఆడతానని తాను చాలాసార్లు ఆప్టన్‌ను కోరానని, అది కూడా ఆ జట్టుపై తనకున్న మంచి రికార్డు కారణంగానే అడిగానని శ్రీశాంత్‌ వెల్లడించాడు. ఈ విషయాన్ని ఆప్టన్‌ మరోలా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడని అన్నాడు. 

‘నేను చెన్నై జట్టును ఎంత అసహ్యించుకుంటానో అందరికీ తెలిసిందే, ఈ విషయాన్ని దాచాల్సిన అవసరం లేదు. అయితే ధోనీ, ఎన్‌ శ్రీనివాసన్ వల్లే తాను చెన్నై జట్టుపై కోపంతో ఉన్నానని చాలా మంది భావిస్తారు. కానీ అది నిజం కాదు. నాకు పసుపు రంగు అంటే నచ్చదు(ఎల్లో జెర్సీ) అందుకే ఆస్ట్రేలియా జట్టుని కూడా అసహ్యించుకుంటాను. అన్నింటికన్నా ముఖ్యం నాకు చెన్నైపై మంచి రికార్డు ఉంది, అందుకే నేను ఆడాలనుకున్నా. అప్టన్‌ను నేను దూషించాననే ఆరోపణలు నిరాశకు గురిచేశాయి. అది పోలీసుల టార్చర్‌ కన్నా దుర్భరంగా అనిపించింది. ఇప్పటికీ ఆ విషయం నన్ను బాధిస్తోంది. వేరే ఆటగాళ్లు ఆప్టన్‌ గురించి మాట్లాడుతూ ఇతనెవరు అసలు? మొత్తం చేసేదంతా కిరస్టెన్‌! అని అంటారు. నేనెప్పుడైనా అతడితో ఇలా ప్రవర్తించానా?అని శ్రీశాంత్‌ వ్యాఖ్యానించాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.