close

తాజా వార్తలు

అవును.. బాగ్దాదీ హతం..!

టర్కీ అధికారిక మీడియాలో వార్తలు 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: ఐసిస్‌ అగ్రనాయకుడు అబు బకర్‌ ఆల్‌ బాగ్దాదీని అమెరికా దళాలు హతమార్చినట్లు టర్కీకి చెందిన అధికారిక వార్తా సంస్థలు ధ్రువీకరించాయి. టర్కీకి చెందిన అనడొలు ఏజెన్సీ (ఏఆర్‌) ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో ట్వీట్‌ చేసింది. దీంతో ఐసిస్‌కు కోలుకోలేని దెబ్బతగిలినట్లయింది. మరోపక్క ఎస్‌డీఎఫ్‌ నేత మజ్లోమ్‌ అబ్దీ కూడా ఇదే రకమైన అర్థాన్ని వచ్చేట్లు ట్వీట్‌ చేశారు. ‘చారిత్రక ఆపరేషన్‌ విజయవంతమైంది. ఇది అమెరికా, ఎస్‌డీఎఫ్‌(కుర్దు) దళాల సమాచార సమన్వయంతోనే ఇది సాధ్యమైంది’ అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు సిరియాలో ఇడ్లిబ్‌ ప్రాంతం నుంచి వచ్చిన వార్తలను బట్టి చూస్తే ఐసిస్‌ నేత బాగ్దాదీ ఈ ఆపరేషన్‌లో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఐసిస్‌ను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన సీక్రెట్‌ ఆపరేషన్‌లో యూఎస్‌ ఆర్మీ..అబు బకర్‌ను హతమార్చినట్లు అమెరికా అధికారులు తెలిపారని ‘న్యూస్‌ వీక్‌’ పత్రిక కథనం ప్రచురించింది. ఈ విషయాన్ని రక్షణశాఖ అధికారులు శ్వేతసౌధానికి చేరవేసినట్లు పెంటగాన్‌లోని ఆర్మీ అధికారులు తెలిపినట్లు కథనంలో పేర్కొంది. అబుబకర్‌ను మట్టుబెట్టడానికి అత్యున్నత స్థాయిలో వ్యూహరచన చేశారు. ఈ ఆపరేషన్‌ను వారం క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా ఆమోదించారని తెలిపింది. ట్రంప్‌ కూడా ‘ఇప్పుడే ఒక పెద్ద ఘటన జరిగింది’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. 

ఎనిమిది హెలికాప్టర్లతో దాడి..
అల్‌ బాగ్దాదీని హతమార్చిన ఆపరేషన్‌కు అమెరికా ఎనిమిది హెలికాప్టర్లను ఉపయోగించినట్లు టర్కీ అధికారిక వార్త సంస్థ వెల్లడించింది. సిరియాలోని ఇడ్లిబ్‌ ప్రాంతానికి సమీపంలోని నిన్న రాత్రి పరీష అనే గ్రామం వద్ద బాగ్దాదీపై అమెరికా దళాలు దాడి చేసినట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్‌ మొత్తం 90 నిమిషాల్లో ముగిసిందని పేర్కొంది. అమెరికా దళాలతో పోరు మొదలుకాగానే బాగ్దాదీ, అతని భార్య పేలుడు పదార్థాలను చుట్టుకొని పేల్చేసుకున్నారని ఆ వార్తాసంస్థ వెల్లడించింది. 
* అమెరికా దళాలు తొలుత అబు మహమ్మద్‌ సలామ్‌ అనే హర్రాస్‌ అల్‌ దిన్‌ అనే సంస్థ కమాండర్‌ ఇంటిపై  దాడి చేశాయి. అపాచీ హెలికాప్టర్లు కూడా అక్కడకు చేరుకొన్నాయి. 
* అక్కడ ఇళల్లో ఉన్నవారు లొంగిపోవాలని అరబిక్‌ భాషలో కోరారు. బాగ్దాదీపేరును వారు ప్రస్తావించలేదు. 
* అక్కడ ఉన్న అబు మహమ్మద్‌ లొంగిపోకుండా కాల్పులు మొదలు పెట్టారు. 
* ఆ ప్రదేశంలో ఉన్న ముగ్గురు పిల్లల్ని అమెరికా దళాలు రక్షించి ఒక గొర్రెలకాపరికి అప్పగించాయి. వారికి టార్చిలైట్‌ ఇచ్చి కిలోమీటర్‌ దూరం వెళ్లాలని సూచించాయి. 
* అనంతరం అక్కడ వైమానిక దాడి నిర్వహించాయి. ఈ క్రమంలో ఇద్దరిని సజీవంగా పట్టుకొన్నట్లు సమాచారం. 
అమెరికా  దళాలు ఆపరేషన్‌ నిర్వహించిన చోట అత్యవసర వైద్య బృందాలు చేరుకొన్నాయి. వారి కథనం ప్రకారం అక్కడ నేలమట్టమైన ఇళ్లు, కాలిపోయిన గుడారాలు చెల్లాచెదురుగా పడిఉన్నట్లు తెలిసింది. 

టర్కీ సరిహద్దుల్లో..
దాదాపు ఏడు రోజుల క్రితం బాగ్దాదీ ఆ ప్రాంతాల్లో ఉంటున్నట్లు దళాల వద్ద పక్కా సమాచారం ఉంది. ఈ ఆపరేషన్‌ జరిగిన ప్రదేశం టర్కీకి కేవలం 3మైళ్ల దూరంలోనే ఉంది. గతంలో ఐసిస్‌కు టర్కీ మద్దతుదారుగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల అమెరికా  ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ టర్కీ పర్యటన సందర్భంగా ఈ ఆపరేషన్‌కు అంకురార్పణ జరిగినట్లు సమాచారం. 

 

 

 

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.