close

తాజా వార్తలు

కుర్ర అభిమానిని ఆశ్చర్యపర్చిన వార్నర్‌

అడిలైడ్‌: ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి అభిమానుల మనసులు గెలిచాడు. ఆదివారం శ్రీలంకతో తలపడిన మ్యాచ్‌లో వార్నర్‌(100*) అద్భుత శతకంతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పర్యాటక జట్టుపై ఆసీస్‌ 134 పరుగుల భారీ తేడాతో గెలుపొందగా మ్యాచ్‌కు ముందు వార్నర్‌ ఓ కుర్ర అభిమానిని ఆశ్చర్యపర్చాడు. స్టేడియంలో ప్రాక్టీస్‌ చేసి తిరిగి డ్రెస్సింగ్‌ రూమ్‌కి వెళ్తున్న సమయంలో ఆసీస్‌ ఓపెనర్‌.. ఓ బాలుడికి తన గ్లోవ్స్‌ను బహుమతిగా ఇచ్చాడు. దీంతో ఆ బాలుడి ముఖం ఆశ్చర్యంతో నిండిపోయింది. వార్నర్‌ ఇచ్చిన గ్లోవ్స్‌ను చూసుకుంటూ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను క్రికెట్‌.కామ్‌ అనే వెబ్‌సైట్‌ ట్విటర్‌లో పోస్టు చేసింది. అయితే, వార్నర్‌ గత వన్డే ప్రపంచకప్‌లోనూ ఇలాగే ఓ చిన్నారిని ఆశ్చర్యపర్చాడు. ఒక మ్యాచ్‌లో తనకు లభించిన ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును చిన్నారికి బహుకరించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.